బాలయ్య, మోక్షజ్ఞ విషయం శుద్ధ అబద్ధం.. అలాంటి వారు కనిపించడం లేదు.. ఎన్టీఆర్ ఇంటర్వ్యూ

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశ. ఈ చిత్రంలో జై అనే పవర్‌పుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జై పాత్ర ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందింది. సెప్టెంబర్ 21 ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.

By Rajababu

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశ. ఈ చిత్రంలో జై అనే పవర్‌పుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జై పాత్ర ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందింది. సెప్టెంబర్ 21 ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్ర విషయాలను తెలుగు ఫిల్మ్ బీట్‌తో ప్రత్యేకంగా పంచుకొన్నారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు ఇవే.

జై లవకుశ గురించి మీ ఫీలింగ్

జై లవకుశ గురించి మీ ఫీలింగ్

నటుడిగా ఏదో చేయాలన్న తపన, ఆసక్తిలో భాగంగానే సినిమాలు చేస్తుంటాను. అలాగే నన్ను అమితంగా అభిమానించే ఫ్యాన్స్‌ను సంతోషం కలిగించాలి అనే ఫీలింగ్ వెంటాడుతుంది. అలాంటి పరిస్థితుల్లో చేసిన సినిమా జై లవకుశ.

మూడు పాత్రల వల్ల మూడు సినిమాలు చేసిన ఫీలింగ్ కలిగిందా?

మూడు పాత్రల వల్ల మూడు సినిమాలు చేసిన ఫీలింగ్ కలిగిందా?

మూడు సినిమాలు కాదు. వంద సినిమాలు చేసినంత అనుభవం కలిగింది. మూడు పాత్రలు కత్తిమీద సామే. బాగా కష్టంగా అనిపించింది. జై లవకుశ లాంటి సినిమా చేయడం అంత సులభం కాదు. అంతిమంగా సినిమా రిజల్ట్‌ను బట్టి సంతృప్తి అనేది ఉంటుంది.

బిగ్‌బాస్ మీ ఇమేజ్‌ను పెంచిందని అనుకొంటున్నారా?

బిగ్‌బాస్ మీ ఇమేజ్‌ను పెంచిందని అనుకొంటున్నారా?

ఇమేజ్ అంటే ఒక్కొరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఇమేజ్ అనే విషయాన్ని పక్కన పెడితే బిగ్‌బాస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాను. సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రమే ప్రేక్షకులను కలిసే అవకాశం ఉండేది. కానీ బిగ్‌బాస్ ద్వారా ప్రతివారం ప్రేక్షకులను కలిసే ఛాన్స్ లభించింది. కొత్తదాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తారనే విషయంపై మరోసారి నమ్మకం కలిగింది.

జై లవకుశ పాత్రలు చేయడానికి ప్రేరణ ఏంటీ

జై లవకుశ పాత్రలు చేయడానికి ప్రేరణ ఏంటీ

లవ, కుశ పాత్రలు చేయడానికి నా సినిమాలోని నా పాత్రలే ప్రేరణ. కుశ పాత్రకు యమదొంగలోని పాత్ర, లవ పాత్రకు నాన్నకు ప్రేమతో లాంటి పాత్ర రెఫరెన్స్. జై పాత్రకు రెఫరెన్స్ అసలు దొరకలేదు. చాలా కష్టం అయింది. అందుకోసం రకరకాల పరిశోధన చేశాం. అలా చేసిన రిసెర్చ్ నుంచి పుట్టిన ఆహార్యమే జై పాత్ర. జై పాత్ర నత్తి అనేది దర్శకుడు బాబీదే ఛాయిస్.

జై పాత్రకు ప్రేరణ రావణాసురుడు..

జై పాత్రకు ప్రేరణ రావణాసురుడు..

జై పాత్రకు ప్రధాన స్ఫూర్తి రావణాసురుడు. రాముడు సైతం చూసి ఆశ్చర్యపోయే ఆహార్యం ఆయనది. నవ్వులో రాజసం. చూపులో తీక్షణం ఉండాలి అనే నిర్ణయానికి వచ్చాం.

రామారావుగారు మీకు స్పూర్తియా?

రామారావుగారు మీకు స్పూర్తియా?

రావణాసురుడి లాంటి పాత్రలను చేయడంలో రామారావు (తాత) అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పాడు. అందుకే అంతగా రిసెర్చ్ చేశాం. ఆయనను, వాటిని అందుకోవడం చాలా కష్టం.

నిర్మాణ బాధ్యతలు మోయాల్సి వచ్చిందా?

నిర్మాణ బాధ్యతలు మోయాల్సి వచ్చిందా?

ఈ సినిమా తన సోదరుడు కల్యాణ్ రామ్ నిర్మిస్తుండటంతో హీరో పాత్రలతో పాటు, నిర్మాత పాత్రను కొన్నిసార్లు పోషించాల్సి వచ్చింది. అమ్మ, నాన్న, మా వారసులు, అభిమానులు మెచ్చే సినిమా అవుతుంది.

మహాభారతం చిత్రంలో మీరు నటిస్తున్నారా?

మహాభారతం చిత్రంలో మీరు నటిస్తున్నారా?

ఒకవేళ రాజమౌళి మహాభారతం చిత్రం తెరకెక్కిస్తే నేను తప్పకుండా ఉంటాను. రాజమౌళి ఏ పాత్ర ఇస్తాడో తెలియదు. కానీ ఏదో ఒక పాత్ర మాత్రం తప్పకు ఉంటుంది.

బాలయ్య, మోక్షజ్ఞ సినిమా చూశారంట?

బాలయ్య, మోక్షజ్ఞ సినిమా చూశారంట?

జై లవకుశ సినిమాను బాబాయ్ బాలకృష్ణ, మోక్షజ్ఞ చూశాడనే వార్తలను యంగ్ టైగర్ ఖండించారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్త నిజం కాదు. జై లవకుశ చిత్రాన్ని బాలయ్య చూశాడని వచ్చిన వార్తలు శుద్ధ అబద్ధం.

తాతగారి మాదిరిగా పౌరాణిక చిత్రాల్లో నటిస్తారా?

తాతగారి మాదిరిగా పౌరాణిక చిత్రాల్లో నటిస్తారా?

తాతగారు రామారావు మాదిరిగా పౌరాణిక చిత్రాల్లో నటించాలని ఉంది. అలాంటి కథలను హ్యాండిల్ చేయగలిగే దర్శకులు ఉంటే తప్పకుండా చేస్తాను. భవిష్యత్‌లో ఏమి జరుగుతుందో వేచిచూద్దాం అని ఎన్టీఆర్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X