ఆహార్యం.. రొమాన్స్.. యాక్షన్..ఊసరవెల్లికి యు/ఎ సర్టిఫికెట్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఊసరవెల్లి" అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. తమన్నా ఈ చిత్రంలో కథానాయిక. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా పతాకంపై ఛత్రపతి ప్రసాద్ నిర్మించారు.
సెన్సార్ పూర్తయిన సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'మా సినిమా యుఎ సర్టిఫికెట్ అందుకుంది. దసరా కానుకగా అక్టోబర్ 6న విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన దేవిశ్రీ ప్రసాద్ అందించిన అద్భుతమైన ఆడియోకి శ్రోతలనుంచి విశేష స్పందన వచ్చింది. త్వరలో ప్లాటినం డిస్క్ వేడుకను చేస్తున్నాం. ఎన్టీఆర్ చిత్రాల్లో వైవిధ్యమైన చిత్రంగా 'ఊసరవెల్లి" రూపొందింది. ఎన్టీఆర్ బిగ్గెస్ట్ హిట్ చిత్రమవుతుంది.
జూ ఎన్టీఆర్ తన కెరీర్ లోనే పెద్ద విజయం అందుకో బోతున్నారు. ఆహర్యం.. రొమాన్స్.. యాక్షన్.. అన్నిటా వైవిధ్యం ఉన్న సినిమా ఇది. హీరో కొత్తగా కనిపిస్తారు. అన్ని వర్గాలను అలరించేలా తెరకెక్కింది" అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీప్రసాద్, కెమెరా: రసూల్ ఎల్లోర్, కళ: రవీందర్, కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామ చంద్ర, కథనం- దర్శకత్వం: సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











