Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు పది లక్షల సైన్యం!
వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో అరుదైన ఘనతను సాధించాడు. సోషల్ మీడియాలో అంత చురుకుగా కనిపించని ఎన్టీఆర్ ట్విట్టర్లో పది లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకొన్నాడు.
వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో అరుదైన ఘనతను సాధించాడు. సోషల్ మీడియాలో అంత చురుకుగా కనిపించని ఎన్టీఆర్ ట్విట్టర్లో పది లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకొన్నాడు. సోషల్ మీడియాలో ఈ ఘనతను సొంతం చేసుకోవడంపై నందమూరి అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
సోషల్ మీడియా వెబ్సైట్ ట్విట్టర్లో ఎన్టీఆర్ 2009లో ఖాతాను తెరిచాడు. ఈ మధ్యకాలంలోనే తన చిత్రాల గురించి ఫ్యాన్స్‌కు అప్డేట్స్ ఇస్తున్నారు. దాంతో అతని అకౌంట్లో ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారు. అతి తక్కువ కాలంలోనే యంగ్ టైగర్ ఒక మిలియన్ మార్కును అధిగమించడం విశేషం.
ఎక్కువగా వెండితెరకు మాత్రమే పరిమితమైన ఎన్టీఆర్ ప్రస్తుతం బిగ్ బాస్ రియాలిటీ షోతో టెలివిజన్ రంగంలోకి ప్రవేశించనున్నారు. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించే ఈ కార్యక్రమం స్టార్ మా టెలివిజన్‌లో ప్రసారం కానున్నది. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న జై లవకుశ చిత్రం సెప్టెంబర్ 21న రిలీజ్ కానున్నది.