Jr NTR: అభిమాని అనుమానాస్పద మృతి.. లేఖ విడుదల చేసిన ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మృతి కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనపై యావత్ ఎన్టీఆర్ అభిమానులు కన్నీటి సంద్రమవడమే కాదు... శ్యామ్ మరణం విషయంలో న్యాయం చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. శ్యామ్ మరణం ఆత్మహత్య అని వార్తలు రాగా దానిపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ తారక్ అభిమానులు, టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై తాజాగా ఎన్టీఆర్ ఓ లేఖ రిలీజ్ చేశారు. ఆవివరాలు...

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఏపీకి చెందిన శ్యామ్ అనే కుర్రాడు అనుమానస్పదంగా మృతి చెందాడు. ఇప్పుడు ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. తన అమ్మమ్మ ఊరు అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రుకు వారం రోజుల క్రితం వచ్చిన శ్యామ్... జూన్ 25న శనివారం అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. చేతి మణికట్టుపై బ్లేడ్ తో పలుసార్లు కోసుకుని... ఉరివేసుకున్న స్థితిలో శ్యామ్ మృతదేహం కనిపించింది. ఇప్పటికే పోలీసులు ఈ ఘటనపై అనుమానస్పద కేసుగా నమోదుచేసి మృతదేహానికి పోస్ట్‌మార్టం కూడా నిర్వహించారు.

అయితే ఎన్టీఆర్ అభిమానిగా గుర్తింపు తెచ్చుకున్న శ్యామ్... అనుమానాస్పదంగా చనిపోవడంతో సోషల్ మీడియాలో ఒక్క సారిగా రాజకీయ ప్రకంపనలు రాజుకున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ శ్యామ్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం మీద నారా లోకేష్, చంద్రబాబు వంటి వారు ప్రభుతం నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేయగా ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో స్పందిస్తూ ఓ లేఖను రిలీజ్ చేశాడు.

లేఖలో ఎన్టీఆర్ ఇలా రాస్తూ... 'శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన, శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచి వేస్తుంది, ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను'' అంటూ జూనియర్ ఎన్టీఆర్ రాసుకొచ్చారు. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.

అనుమానస్పద రీతిలో మృతిచెందిన శ్యామ్ స్వస్థలం గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం. అక్కడి కాట్రేనికోన మండలంలోని కొప్పిగుంట అయినా కుటుంబం చాలా కాలం నుంచి తిరుపతిలో ఉంటున్నారు. హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసిన శ్యామ్... కాకినాడలో జాబ్ చూసుకుంటానని కొత్తపేట మండలంలోని మోడేకుర్రులోని తన అమ్మమ్మ ఇంటిలో వారం రోజులుగా ఉంటున్నాడు. అయితే శనివారం చేతి మణికట్టు వద్ద పలుసార్లు బ్లేడుతో కోసుకుని, అదే బ్లేడును తన జేబులో పెట్టుకుని ఉరి వేసుకుని మృతిచెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. అయితే వైసీపీ నేతలే హత్య చేయించారంటూ... ఓ వాదన వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











