twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో రికార్డ్ సృష్టించిన జూ ఎన్టీఆర్ ‘బాద్ షా’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటిస్తున్న 'బాద్ షా' చిత్రం విడుదలకు ముందు పలు రికార్డులు సృష్టిస్తూ దుమ్ము రేపుతోంది. ఇప్పటికే సీడెడ్, నెల్లూరు ఏరియాల్లో రికార్డ్ ధరకు ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడు పోగా....తాజాగా గుంటూరు ఏరియా రైట్స్ కూడా సరికొత్త రికార్డ్ సృష్టించింది.

    ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం 'బాద్ షా' గుంటూరు ఏరియా రైట్స్ రూ. 4 కోట్ల పలికినట్లు తెలుస్తోంది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం 'బాద్ షా' మూవీ సీడెడ్ ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఏకంగా రూ. 8.10 కోట్లుకు శోభన్ అనే డిస్ట్రిబూటర్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అదే విధంగా నెల్లూరు ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రూ. 2 కోట్లు అమ్ముడయ్యాయని టాక్.

    శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈచిత్రంలో హీరోయిన్. ఈ చిత్రం ఆడియో ఈ మార్చి 10 న విడుదల కానుంది. అలాగే చిత్రం ఏప్రియల్ 5 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

    ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    
 Hyderabad: Junior NTR's Baadshah is one of the much-talked about and most-awaited Telugu movies. The young tiger is playing a brand new role, and his stylish new avatar, which has created a lot of craze for the film, has created a great demand for its distribution rights in the market. According to reports, its rights for Guntur area have been sold for a whopping price.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X