లావు మ్యాటర్ పై ఎన్టీఆర్ హామీ
ఎన్టీఆర్ తాజా చిత్రం ఊసరవెల్లిలో మళ్లీ లావుగా కనిపించటంతో మీడియాలో ఈ విషయం చర్చనీయాంసమైంది. ఊసరవెల్లి ప్రమోషన్ లో భాగంగా కలుస్తున్న మీడియా వారికి ఈ విషయమై ఎన్టీఆర్ క్లారిఫికేషన్ ఇస్తున్నారు. ఆయన తనకు పెళ్లి అవటం వల్లనే లావు అయ్యానని, అది తన వివాహ జీవితం విజయవంతగా జరగిందనటానకి గుర్తు అన్నారు. అయితే భవిష్యత్ లో తాను లావుగా కనపడనని, గతంలో కనపించినంత లావుగా కానని, తగ్గిపోతానని, ఆ విషయం దమ్ము చిత్రంలో గమనించవచ్చునని ఎన్టీఆర్ తన అభిమానులకు హామీ ఇచ్చారు. రాఖీ చిత్రం సమయంలో ఉన్నంత లావు మాత్రం కానని నవ్వుతూ అన్నారు. ఇక ఈ చిత్రంలో కరెంట్ తీగ కూడా నా లాగ సన్నగ ఉంటుంది, దానమ్మ ముట్టుకుంటే షాక్ కొడుతుంది అన్న డైలాగు చెప్తారు.ఈ డైలాగు రాసే సమయానికి సన్నగా ఉన్నా,చెప్పే సమయానికి లావు అవటంతో సినిమాలో ఈ డైలాగు,శరీరం సింక్ కాకూండా పోయింది.
ఇక ఊసరవెల్లి చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ మాత్రం బాగానే తెచ్చుకుంటోంది.ఇక ఊసరవెల్లి గురించి చెపుతూ... హీరోయిన్ మీద రన్ అయ్యే సినిమా అనేసరికి అందరికీ రిస్క్ అనే భావన వస్తుంది. కానీ నేను తొలిసారి వినగానే కథ బాగా నచ్చింది. అస్సలు హీరోయిన్ మీద నడవకపోతే కథలో కొత్తదనమేముంటుంది. లేడీస్ అందరూ ఈ కథకు అంత బాగా కనెక్టు అవుతున్నారంటే కారణం కథే.కాకపోతే టైటిల్ పరంగా కొంత ఆలోచించా అన్నారు. ఇక ఈ చిత్రం నా జీవితంలో ఇదో ప్రత్యేక చిత్రంగా మిగిలిపోతుంది. కథా పరంగా ఓ ప్రయోగం గా అనిపించింది. ఇంటర్వెల్ అయిన తర్వాత తమన్నా ప్లాష్ బ్యాక్ మొదలవుతుంది. దాదాపు ఇరవై నిముషాల సేపు హీరో కనపడడు. వాణిజ్య అంశాలు మేళవించిన చిత్రాల్లో ఇలాంటి ఎత్తుగడ ఓ ప్రయోగం.. ప్రమాదం అన్నారు. కానీ సురేంద్రరెడ్డి ఈ పాయింటు చెప్తున్నప్పుడు బాగా నచ్చి చేసాను అన్నారు.


Click it and Unblock the Notifications











