twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్‌పై జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ కామెంట్.. వివాదాలా. అయితే అప్పుడు చూద్దాం..

    ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తాను సినిమా తీస్తానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించడం ఈ చర్చకు ప్రధాన కారణమైంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్‌ గురించి బాలకృష్ణ, లోకేశ్ కూడా స్పందించారు.

    By Rajababu
    |

    గతంలో ఎన్నడూ లేని విధంగా మీడియాలో లెజెండ్, నటరత్న నందమూరి తారక రామారావు బయోపిక్‌పై విపరీతమైన చర్చ జరుగుతున్నది. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తాను సినిమా తీస్తానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించడం ఈ చర్చకు ప్రధాన కారణమైంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్‌ గురించి బాలకృష్ణ, లోకేశ్ కూడా స్పందించారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, సినీ నటుడు పోసాని కృష్ణమురళీ వర్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్‌పై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు.

    ఎన్టీఆర్ బయోపిక్‌పై సానుకూలం

    ఎన్టీఆర్ బయోపిక్‌పై సానుకూలం

    హైదరాబాద్‌ మదాపూర్‌లోని ఓ హోటల్‌లో బిగ్‌బాస్ ప్రీ లాంచ్ ఈవెంట్‌ను శనివారం నిర్వహించారు. ఆ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఎన్టీఆర్ విషయంపై తన అభిప్రాయాన్ని కోరారు. అందుకు ఎన్టీఆర్ బయోపిక్‌పై సానుకూలంగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

    తెలుగు ప్రజల ఆస్తి

    తెలుగు ప్రజల ఆస్తి

    ఎన్టీఆర్ బయోపిక్‌పై జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు గారు ఏ ఒక్క కుటుంబానికి చెందిన వారో కాదు. ఆయన తెలుగు ప్రజల, ప్రపంచ తెలుగువాళ్ల ఆస్తి. ఆయన జీవితం అందరికీ స్పూర్తి దాయకం అని అన్నారు. నా జీవితానికి ఎన్టీఆర్ స్ఫూర్తి. అంతేకాకుండా ఎందరో అభిమానులకు ఆయన దైవంతో సమానమని పేర్కొన్నారు.

    బాలకృష్ణ సినిమా చేయడం గొప్ప విషయం

    బాలకృష్ణ సినిమా చేయడం గొప్ప విషయం

    నందమూరి బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నారనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తీయడం చాలా గొప్ప విషయం అని అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

    ఇంకా ఆలోచించలేదు

    ఇంకా ఆలోచించలేదు

    ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించే విషయం గురించి ఇంకా ఆలోచించలేదు. ఆ మహానుభావుడి జీవిత కథ తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు. గొప్ప నటుడు గురించి భవిష్యత్ తరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే ధోరణిని ఆయన వ్యక్తం చేశారు.

    వివాదాలా అయితే చూద్దాం..

    వివాదాలా అయితే చూద్దాం..

    ఎన్టీఆర్ బయోపిక్‌లో వివాదాస్పద అంశాలను కూడా ప్రస్తావిస్తానని రాంగోపాల్ వర్మ ప్రస్తావించిన విషయాన్ని ఎన్టీఆర్ దృష్టికి తీసుకురాగా.. సినిమా రూపొందే సమయంలో వాటి గురించి ఆలోచిద్దాం. అప్పటివరకు వేచి చూడటమే మనం చేయాల్సిందనే రూపంలో సమాధానం ఇచ్చారు.

    English summary
    Bigboss Pre launch event organised in Hyderabad on July 7th. Junior NTR attended the event as chief Guest. In this meeting Junior NTR said, Legendary actor NTR is asset of Telugu people. He responded positively for NTR Boipic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X