twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రభస’ లో ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ ...(ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్టీఆర్ కెరీర్ మొదట నుంచి హెయిర్ స్టైల్స్ లో ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. రీసెంట్గా విడుదలైన బాధ్షా లో.. డిఫెరెంట్ హెయిర్ స్టైల్స్ తో కనిపించిన ఆయన రాబోయే రభస చిత్రం లో కూడా చాలా విభిన్నంగా కనిపించటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ప్రిపేరవుతున్నట్లు సమాచారం. అందులోనూ ఈ చిత్రంలో ఆయన ప్లే బోయ్ గా కనిపించనున్నారు కూడా.

    ఈ నేఫధ్యంలో ఈ చిత్రం లో ఎన్టీఆర్ ఎలా కనపడనున్నారు. ఎలాంటి హెయిర్ స్టైల్ లో కనపడనున్నారనేది ఆసక్తే. ఈ విషయమై దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... "మేం ఇప్పటి వరకూ ప్రత్యేకంగా ఏదీ అనుకోలేదు. కానీ కొత్త హెయిర్ స్టైల్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. ఈ చిత్రంలో మల్టిఫుల్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించబోతున్నాడు. అందులో భాగంగానే హెయిర్ స్టైల్ ని మార్చాలనుకుంటున్నాం ," అని తేల్చి చెప్పారు.

    రామ్‌ హీరోగా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో శ్రీసాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్‌ నిర్మించిన 'కందిరీగ' భారీ విజయం అందుకుంది. ఆ ఉత్సాహంతో ఈ సారి సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఇదే బేనరులో ఎన్టీఆర్‌ హీరోగా సినిమా తెరకెక్కనుంది. వచ్చే నెల నుంచి ఈ చిత్రం ప్రారంభం కానుందని దర్శకుడు రీసెంట్ గా ప్రకటించాడు కూడా.

    ఈ విషయమై బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌కి సరిగ్గా సరిపోయే కథని సంతోష్‌ సిద్ధం చేశారు. కథ వినగానే ఎన్టీఆర్‌ ఎంతో ఇన్‌సై్పర్‌ అయి మార్చి నుంచి సెట్స్‌కెళదామని అన్నారు. సమంత ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం'' అని తెలిపారు. 'ఆది' వంటి మెగాహిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ పదేళ్ల తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌తో సినిమా తీస్తుండడం విశేషం. ఈ చిత్రానికి సమర్పణ: బెల్లంకొండ సురేష్‌, నిర్మాత: బెల్లంకొండ గణేష్‌బాబు, కథ-కథనం-దర్శకత్వం: సంతోష్‌ శ్రీనివాస్‌.

    ఎన్టీఆర్ ఇప్పటివరకూ చేసిన హెయిర్ స్టైల్స్ ..స్లైడ్ షోలో..

    బాద్షా

    బాద్షా

    ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొంది విడుదలైన చిత్రం బాద్షా. ఈ చిత్రంలో రెండు రకాల పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించారు. ఆ రెండు పాత్రలు దేవికవే విభిన్నం. అందుకే..హెయిర్ స్టైల్ విషయంలో చాలా శ్రద్ద తీసుకున్నారు. ఈ హెయిర్ స్టైల్ లో ఎన్టీఆర్ లుక్ బయిటకు రాగానే ఫ్యాన్స్ చాలా ఆనందపడ్డారు. ఈ స్టైల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

    యమదొంగ

    యమదొంగ

    రాజమౌళి దర్శకత్వంలో నటించేటప్పుడు తప్పకుండా అతని లుక్ మారుస్తాడని అంతా ఆశించారు. దానికితగినట్లుగానే ఎన్టీఆర్ కొత్త హెయిర్ స్టైల్ తో ఈ చిత్రంలో కనిపించి అలరించారు. ఈ స్టైల్ చాలా పాపులర్ అయ్యింది. అందులోనూ సన్నబడి ఎన్టీఆర్ కొత్తగా ఈ చిత్రంలో కనిపించారు. తర్వాత నుంచి అతని లుక్ మారిపోయింది.

    రాఖి

    రాఖి

    కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగాజుట్టు పెంచారు. 2006 లో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకుంది. ఈ హెయిర్ స్టైల్ అప్పట్లో స్టేట్ లో చాలా పాపులర్ అయ్యింది. అతని ఫ్యాన్స్ చాలా మంది దీన్ని అనుకరించారు. సినిమా కూడా మంచి విజయం సాధించింది.

    అదుర్స్

    అదుర్స్

    ఎన్టీఆర్ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేసిన చిత్రం ఇది. ఇందులో కవలలు గా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసారు. పాత్రకు తగ్గట్లు పురోహితుడుగా ఎన్టీఆర్ అదరకొట్టారు. అందుకోసం పెద్ద బొట్టుతో...జుట్టు పెంచి కనిపించారు. ఈ లుక్ ఫన్ నే కాక ఓ బ్రాండ్ ఇమేజ్ ని ఎన్టీఆర్ కి తెచ్చింది. ఎన్టీఆర్ ఎలాంటిపాత్ర అయినా పండించగలరని నిరూపించిన చిత్రం ఇది.

    ఆంధ్రావాలా

    ఆంధ్రావాలా

    2004లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసారు. ఆ పాత్ర కోసం కర్లీ హెయిర్ ని ట్రిమ్ చేసి కనిపించారు. రెండు పాత్రలు మధ్య వేరియేషన్ చాలా స్పష్టంగా కనిపింపచేసారు. సినిమా వర్కవుట్ కాకపోయినా ఎన్టీఆర్ స్టామినాని తెలియచేసిందీ చిత్రం.

    సింహాద్రి

    సింహాద్రి

    ఎన్టీఆర్ కెరీర్ లో పెద్ద హిట్ ఏది అంటే టక్కున సింహాద్రి అని చెప్తారు. ఆ చిత్రంలో మంచి మనస్సున్న అనాధ గా సింహాద్రి కనిపిస్తారు. ఈ పాత్ర కోసం రాజమౌళి..అతని హెయిర్ స్టైల్ ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. చాలా క్యూట్ గా ఈ లుక్ ఉంది. సినిమా విజయానికి ఈ లుక్ కూడా కారణమైంది.

    దమ్ము

    దమ్ము

    బోయపాటి శ్రీను ..తన హీరోలను ప్రత్యేకంగా ప్రజెంట్ చేస్తారు. దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర చాలా ఎమోషనల్ గా సాగుతుంది. అందుకోసం ప్రత్యేకంగా ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ ని డిజైన్ చేయించారు. చాలా న్యాచురల్ గా కర్లీ హెయిర్ ని ట్రిమ్ చేయించారు. ఈ చిత్రం యావరేజ్ అయ్యినా...ఈ లుక్ మాత్రం ఎన్టీఆర్ అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చింది.

    ఊసరవెల్లి

    ఊసరవెల్లి

    సురేంద్ర రెడ్డి చిత్రాలు చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ చేత పూర్తి లుకు మారిపించారు. ఈ హెయిర్ స్టైల్ ప్యాన్స్ కు బాగా నచ్చింది. చాలా చోట్ల ఈ స్టైల్ కనిపించింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా..ఎన్టీఆర్ లుక్ మాత్రం పాపులర్ అయ్యింది. సినిమాకు లుక్ ఎంత ప్రాధాన్యతో ఈ చిత్రం తెలిపింది.

    రభస

    రభస


    ఇప్పుడు అందరి దృష్టీ రామయ్యా వస్తావయ్యా చిత్రంపైనే ఉంది. దాని తర్వాత వచ్చే రభస లో ఎలా కనపడనున్నాడు అనేది ఫ్యాన్స్ కు హాట్ టాపిక్ అయ్యింది. అందులోనూ దర్శకుడు ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుని మరీ చూపించాలని డిసైడ్ అయ్యాం అని చెప్పుతున్నాడు. ఈ నేఫధ్యంలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం అంతా ఎదురుచూస్తారు.

    English summary
    Jr NTR will sport a new hairdo in upcoming Telugu action-drama Rabhasa, says director Santosh Srinivas. "We haven't zeroed in on the look yet, but we have decided to give him a new hairdo. He is playing a character with multiple shades and, therefore, we want to ensure that one of the differentiating factors will be his hairstyle," Santosh told IANS. "We want the look to be different from what he has sported before. We will sit with him and decide on the final look soon," he added. Rabhasa is set to go on floors August first week. It also features Samantha Ruth Prabhu in the lead role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X