పాపం బ్రహ్మాజీ.. చెడుగుడు అడుకున్న ఎన్టీఆర్, సుమ, హరికృష్ణ.. అసలేం జరిగిందంటే..

By Rajababu

టాలీవుడ్ లో నటుడు బ్రహ్మాజీకి హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు ఉంది. ఆయన హీరోగా నటించిన సింధూరం చిత్రం 1997లో విడుదలైన సంగతి తెలిసిందే. అంతకు ముందే ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేశాడు.. బ్రహ్మాజీ. వయసు మీద పడుతున్నా.. కుర్రహీరోలకు తీసిపోకుండా.. తన ఫిట్ నెస్ ను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. ఇంకా యువకుడిలానే కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు బ్రహ్మాజీ. తాజాగా జై లవకుశ ఆడియో ఫంక్షన్ లో బ్రహ్మాజీని ఎన్టీఆర్, సుమ, హరికృష్ణ చెడుగుడు అడుకున్నారు.. అసలేం జరిగిందంటే..

బ్రహ్మాజీని ఆటపట్టించిన..

బ్రహ్మాజీని ఆటపట్టించిన..

ఎన్నో సందర్భాల్లో బ్రహ్మాజీని ఆటపట్టించిన యాంకర్ సుమ.. ఆదివారం జరిగిన జై లవకుశ ఆడియో ఫంక్షన్ లోనూ బ్రహ్మాజీని చెడుగుడు ఆడేసింది. సుమనే కాకుండా.. జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణతో పాటు.. పలువురు బ్రహ్మాజీని ఆటపట్టించారు.

సుమకు బ్రహ్మాజీ చురకలు

సుమకు బ్రహ్మాజీ చురకలు

జై లవకుశ ఆడియో ఫంక్షన్ లో సుమ మాట్లాడుతూ.. నీ వయసెంత అని బ్రహ్మాజీని అడిగింది. అందుకు సమాధానం ఇస్తూ.. తన వయసు 32 ఏళ్లు అని బ్రహ్మాజీ చెప్పాడు. బాలనటుడిగా ప్రవేశించడం వల్ల పరిశ్రమలో ఎక్కువ కాలం ఉన్నట్టు అనిపిస్తోందని అన్నాడు. అంతే కాకుండా.. రాజీవ్ కనకాల కంటే.. రెండేళ్లు మాత్రమే పెద్ద అని సుమకు చురకలు అంటించాడు... బ్రహ్మాజీ.

పూజ్యులు, పెద్దలు, ఆద్యులు అంటూ ఎన్టీఆర్

పూజ్యులు, పెద్దలు, ఆద్యులు అంటూ ఎన్టీఆర్

సుమ, బ్రహ్మాజీ సంభాషణలో జూనియర్ ఎన్టీఆర్ జోక్యం చేసుకుని.. బ్రహ్మాజీ ఈ కాలం నాటి వాడు కాదు. మా నాన్న సీతారామరాజులో నటించేటపుడు బ్రహ్మాజీని చూశాను అని అన్నాడు. అంతటితో వదలకుండా.. పూజ్యులు, పెద్దలు, ఆద్యులు అంటూ ఎన్టీఆర్ ఆటపట్టించాడు. అంతే కాకుండా.. నాగయ్య కాలం నాటి మనిషి అన్నాడు.

రాశీఖన్నా సన్నబడినట్టుందే ..

రాశీఖన్నా సన్నబడినట్టుందే ..

ఎన్టీఆర్, సుమ వేసే సెటైర్ల నుంచి తప్పించుకోడానికి.. ఏంటీ రాశీఖన్నా సన్నబడినట్టుందే అంటూ రూట్ మార్చే ప్రయత్నం చేశాడు బ్రహ్మాజీ. దాంతో సుమ జోక్యం చేసుకుని.. కన్నాంబ నుంచి రాశీఖన్నా వరకూ హీరోయిన్లకు బిస్కెట్ వేయడమేనా అని ఆట పట్టించింది.

బ్రహ్మాజీ నాకు అన్నలాంటి వాడు

బ్రహ్మాజీ నాకు అన్నలాంటి వాడు

ఆడియో వేడుకలో జూనియర్ తండ్రి, నటుడు హరికృష్ణ మాట్లాడుతూ.. బ్రహ్మాజీ నాకు అన్నలాంటి వాడు అనడంతో.. మళ్లీ వేదిక అంతా నవ్వులతో ఘొల్లుమంది. ఇలా.. సుమ, ఎన్టీఆర్, హరికృష్ణ ఎన్ని సెటైర్లు వేసినా.. వాటిని స్పోర్టివ్ గా తీసుకుంటూనే ఎదురుదాడి చేసేందుకు బ్రహ్మాజీ ప్రయత్నించాడు. కానీ.. వారి ముందు ఆయన పప్పులు ఉడకలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X