twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంద్రబాబు, లోకేష్ లకు కరోనా.. స్పందించిన జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్.. ఏమన్నారంటే?

    |

    ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమతో పాటు సినీ రాజకీయ వర్గాలకు చెందిన అనేక మంది ఈ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ కరోనా బారిన పడడంతో మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి వారి ఆయన తిరిగి పూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.ఆ వివరాల్లోకి వెళితే

    కరోనా బారిన లోకేష్

    కరోనా బారిన లోకేష్

    ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. అందులో భాగంగానే నారా లోకేష్ సోమవారం నాడు కరోనా బారిన పడ్డాను అనే విషయాన్ని వెల్లడించారు. తనకు కరోనా సోకడంతో గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు అందరు టెస్ట్ లు చేయించుకోవాలని నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లోనే ఉన్నాను అని తనకు చిన్నపాటి లక్షణాలు కనిపిస్తున్నాయి అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.

    కరోనా బారిన చంద్రబాబు

    కరోనా బారిన చంద్రబాబు

    సరిగ్గా నారా లోకేష్ ప్రకటించిన ఒక్క రోజు తర్వాత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా తాను కరోనా బారిన పడినట్లుగా వెల్లడించారు. తాను కరోనా టెస్ట్ చేయించుకోవడం తో దాని ఫలితం పాజిటివ్ అని వచ్చింది అని ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవాలి అని ఆయన కోరారు. అంతేకాక రెండు డోసులు వ్యాక్సినేషన్ తీసుకోవాలని మాస్కు ధరించి మాత్రమే బయటకు వెళ్లాలి అని ఆయన సూచనలు చేశారు.

    మెగాస్టార్ ఏమన్నారంటే

    మెగాస్టార్ ఏమన్నారంటే

    ఈ విషయం తెలిసిన వారంతా చంద్రబాబు, లోకేష్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ వంటి వారంతా.. వారు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్స్ చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, లోకేష్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. ''కరోనా మహమ్మారి నుండి నారా చంద్రబాబుగారు, నారా లోకేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను, తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుని వేగంగా కోలుకుంటారని భావిస్తున్నాను..'' అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.

    ఎన్టీఆర్ ఏమన్నారంటే

    ఎన్టీఆర్ ఏమన్నారంటే


    ఇక ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. ''మావయ్య చంద్రబాబు నాయుడుగారు మరియు లోకేష్.. కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలి. త్వరలోనే పూర్తి ఆరోగ్యవంతులుగా తిరిగిరావాలని కోరుతున్నాను..'' అని పేర్కొన్నారు. కాగా, అంతకుముందు ఎన్టీఆర్ కరోనా బారిన పడినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా.. ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అయితే తెలుగుదేశానికి ఎన్టీఆర్ కు మధ్య అంత సన్నిహిత సంబంధాలు లేవు అని ప్రచారం జరుగుతూ ఉంటుంది. వారందరికీ ఈ ఒక్క ట్వీట్ తో జూనియర్ ఎన్టీఆర్ సమాధానం చెప్పినట్లు అయింది.

    పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే

    పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే

    మరో పక్క చంద్రబాబు త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కోరారు. జనసేన తరపున ఒక ప్రకటన విడుదల చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే చంద్రబాబు కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు గా పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కరోనా నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

    English summary
    ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమతో పాటు సినీ రాజకీయ వర్గాలకు చెందిన అనేక మంది ఈ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ కరోనా బారిన పడడంతో మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి వారి ఆయన తిరిగి పూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.ఆ వివరాల్లోకి వెళితే
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X