»   »  హైటెక్ వ్యభి చారం లో బుక్ అయిన టీవీ ఆర్టిస్టులు : హైదరాబాద్ లో మరిన్ని కేసులు

హైటెక్ వ్యభి చారం లో బుక్ అయిన టీవీ ఆర్టిస్టులు : హైదరాబాద్ లో మరిన్ని కేసులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాధారణ ప్రజలకు, బయటి ప్రపంచానికి వ్యభిచారం అనేది ఓ పెద్ద తప్పులా కనిపిస్తున్నా....సినిమా రంగంలో మాత్రం ఇది కామన్ అయి పోయింది. తరచూ సినీరంగానికి చెందిన పలువురు అరెస్టు అవుతున్నా ఆ తప్పుడు దారి పడుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.అందమైన రంగుల ప్రపంచంలా కనిపించే సినిమా రంగం చూడటానికి ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రతి రంగంలోనూ ఉన్నట్లే సినిమా రంగంలోనూ ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. సినిమాల్లో సరైన అవకాశాలు లేక బతుకు బండి సాగించేందుకు కొందరు, జల్సా జీవితానికి అలవాటు పడి ఈజీ మనీ కోసం మరికొందరు కారణాలు ఏమైనా కానివ్వండి....పలువురు తారలు వ్యభిచారం చేస్తూ పట్టుబడటం సినిమా ఇండస్ట్రీ కీర్తిని మసకబారేలా చేస్తోంది.

డబ్బు సంపాదనకు

డబ్బు సంపాదనకు

సినిమా తారలు వ్యభాచారం బాట పట్టడానికి వారు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడటం, అవకాశాలు లేక పోవడమే అని విశ్లేషకులు అంటున్నారు. అవకాశాలు ఉన్నప్పుడు డబ్బు సంపాదిస్తూ విలాసాలకు అలవాటు పడిన తారలు...అవకాశాలు లేని సమయంలో డబ్బు సంపాదనకు వ్యభిచారం ఊబిలోకి దిగుతున్నారని అంటున్నారు.

బుల్లితెర నటి సుకన్య ఛటర్జీ

బుల్లితెర నటి సుకన్య ఛటర్జీ

ఇటీవల హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌‍లోని స్టార్ హోటల్ దసపల్లాలో కూడా బెంగాలీ బుల్లితెర నటి సుకన్య ఛటర్జీ వ్యభిచారం కేసులో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారం అందుకుని ఆమెను అరెస్టు చేసారు. ఈ సంఘటనలో ఆమెతో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేసారు

హైటెక్ వ్యభిచారం

హైటెక్ వ్యభిచారం

ఇలాంటి వాళ్లు తమ లగ్జరీ జీవితాల కోసం తప్పుడు పనులు చేస్తూ పోలీసులకు చిక్కుతూనే ఉంటారు. ఇప్పటికే కొంత మంది సిని, టీవి తారలు హైటెక్ వ్యభిచారలంలో పట్టు పడిన విషయం తెలిసిందే. తాజాగా సినిమాల్లో , అలాగే టివి సీరియల్ లలో చిన్న చిన్న వేషాలు వేస్తూ జీవనం సాగిస్తున్న ఇద్దరు నటీమణులు హైటెక్ వ్యభిచారం మొదలు పెట్టారు. ఈజీ మనీ కోసం , విలాసాల కోసం ఏకంగా ఆన్ లైన్ వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు.

మేకప్ మెన్ భండారి

మేకప్ మెన్ భండారి

ఈ వ్యవహారాలపై ఇప్పటికే నిఘా పెట్టిన పోలీసులు..యూసుఫ్ గూడా , మధురానగర్ లో ఉంటున్న ఓ జూనియర్ ఆర్టిస్ట్ , మరో నటి తో పాటు మేకప్ మెన్ భండారి తో కలిసి ఈ వ్యభిచారాన్ని నడిపిస్తున్నట్లు తెలుసుకున్నారు. గట్టి నిఘా పెట్టిన వారికి ఆన్ లైన్ లో బోడుప్పల్ కి చెందిన వాళ్లతో బేరం కుదుర్చుకొని వెళ్లి అక్కడ పోలీసులకు దొరికి పోయారు . ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు .

English summary
Three persons, including a TV serial actress, were arrested by the police for running a prostitution racket from Boduppal
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu