Jurassic World Dominion Twitter Review : కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా మూవీ!
జురాసిక్ పార్క్, జురాసిక్ వరల్డ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ మాస్టర్ మైండ్ స్టీఫెన్ స్పీల్‌బర్గ్ ప్రారంభించిన ఈ జురాసిక్ ఫ్రాంచైజీలో రెండు సిరీస్‌లు ఉన్నాయి. 1993 నుంచి 2001 వరకు వచ్చిన మూడు సినిమాలు జురాసిక్ పార్క్ ట్రయాలజీ కాగా 2015 నుంచి జురాసిక్ వరల్డ్ డొమినియన్ వరకు వచ్చిన మూడు సినిమాలు జురాసిక్ వరల్డ్ ట్రయాలజీలో తెరకెక్కించారు. జురాసిక్ సిరీస్‌లో ఇదే ఆఖరి సినిమా అని ప్రకటించడమీ కాక మొత్తం ఆరు సినిమాల్లో ప్రధాన పాత్రలు ఇందులో మళ్లీ తీసుకురావడంతో 'జురాసిక్ వరల్డ్ డొమినియన్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచింది. మరి సినిమా ఆ స్థాయిలో ఉందా? లేదా? అనేది ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.

కధ ఏమిటంటే
ఈ సినిమా కంటే ముందు విడుదలైన ‘జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్‌డం' సినిమా డైనోసార్లు జనావాసాల్లోకి రావడంతో ముగుస్తుంది. అక్కడి నుంచి సరిగ్గా నాలుగు సంవత్సరాల తర్వాత ‘జురాసిక్ వరల్డ్ డొమినియన్' కథ ప్రారంభం అవుతుంది. శాకాహార డైనోసార్ల వల్ల మనుషులకు పెద్దగా ఇబ్బందులు లేకున్నా మాంసాహార డైనోసార్ల కారణంగా ప్రాణాపాయం ఏర్పడుతూ ఉంటాయి. అదే సమయంలో గుర్తు తెలియని మిడతల దండు భూమి మీద, పంట పొలాల మీద దాడి చేస్తూ ఉంటుంది. ఈ సంఘటనలకు ఎలాంటి పరిష్కారం దొరికిందనేది జురాసిక్ వరల్డ్ డొమినియన్ లో చూపారు.

నాన్-స్టాప్ డైనోసార్ యాక్షన్
జూన్ 10న భారతదేశంలో విడుదలైన జురాసిక్ వరల్డ్: డొమినియన్‌తో డైనోసార్‌లు మళ్లీ పెద్ద స్క్రీన్‌లపైకి వచ్చినట్టు అయింది. కోలిన్ ట్రెవోరో దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది, కొందరు నెటిజన్లు ఈ సినిమా 'నాన్-స్టాప్ డైనోసార్ యాక్షన్' అని పేర్కొనగా, ఎక్కువ మంది ఈ సినిమా 'భారీగా నిరాశ' పరిచింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

నోస్టాల్జిక్ మూమెంట్స్
ఈ జురాసిక్ వరల్డ్ డామినియన్ అనేది ఒక పెద్ద, సరదా సాహసం. డైనోసార్‌లు గతంలో కంటే పెద్దవిగా, మెరుగ్గా ఉన్నాయని ఒక నెటిజన్ పేర్కొన్నారు. ఇది నాన్‌స్టాప్ డైనోసార్ యాక్టివిటీ. లారా డెర్న్, జెఫ్ గోల్డ్‌బ్లమ్ మరియు సామ్ నీల్ తిరిగి రావడంతో నోస్టాల్జిక్ మూమెంట్స్ కనిపించాయి. నేను వారిని ప్రేమిస్తున్నానని పేర్కొన్నారు.

నిరాశపరిచిందని
మరో నెటిజన్ స్పందిస్తూ జురాసిక్ వరల్డ్ డొమినియన్ డైనోసార్ సినిమా నాకు అవసరమని నాకు తెలియదు! అంటూ బాగుందని ఒక నెటిజన్ కామెంట్ చేయగా మరో నెటిజన్ మాత్రం ఈ జురాసిక్ వరల్డ్ డొమినియన్ నిరాశపరిచిందని, మీరు చచ్చేంత బోర్ ఫీలవుతారని, కథ అస్సలు ఎంగేజింగ్‌గా లేదని పేర్కొన్నారు.
Recommended Video


సినిమా బోరింగ్
సినిమా బోరింగ్‌గా ఉంది, అయినా నేను కళ్ళు తెరచి చూడాల్సిన ఏకైక కారణం ఏంటంటే నేను సినిమా కోసం 500 చెల్లించానని పేర్కొన్నారు. ఇక మరో నెటిజన్ ఈ సినిమా గురించి స్పందిస్తూ హహహ, కేవలం జురాసిక్ వరల్డ్ డొమినియన్ చూడండి మరియు నేను ఆర్కియోప్టెరిక్స్ డైనోసార్‌ని చూసినప్పుడు కేకలు వేయడానికి బదులు నేను కాంగ్ టేముని చూసుకుని నవ్వుకున్నానని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











