»   » మా అమ్మ మీద ఒట్టు, తాగుడు మానేస్తున్నా... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌‌కి క్షమాపణ!

మా అమ్మ మీద ఒట్టు, తాగుడు మానేస్తున్నా... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌‌కి క్షమాపణ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద ట్వీట్‌తో సోషల్ మీడియాను వేడెక్కిస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం కాస్త భిన్నంగా.... తన ట్వీట్లతో అందరినీ చల్లబరిచే ప్రయత్నం చేసారు. వోడ్కా మానేస్తున్నానని, ఇంతకాలం తన వల్ల బాధకు గురైన వారికి క్షమాపణ చెబుతున్నట్లు ట్వీట్ చేసారు. ఇకపై తన కామెంట్స్ తో ఎవరినీ బాధ పెట్టబోనని తెలిపారు.

రామ్ గోపాల్ వర్మలో ఇంత మార్పు రావడానికి కారణం.... బాలీవుడ్ నటుడు విద్యుత్ జామ్ వాల్. ఇటీవల తన ట్విట్టర్లో వర్మ కొన్ని కామెంట్స్ చేస్తూ.... విద్యుత్ జామ్ వాల్, టైగర్ ష్రాఫ్ ల మార్షల్ ఆర్ట్స్ స్టైల్ మీద కామెంట్స్ చేసాడు.

తాగి మాట్లాడిన ఆడియో

వర్మ ట్వీట్లకు చిర్రెత్తిపోయిన విద్యుత్ జమ్ వాల్.... షావోలిన్ మాంక్ స్టైల్ ను మర్చిపోయి, రామ్ గోపాల్ వర్మ డ్రంకెన్ మాస్టర్ స్టైల్ ను ట్రై చేయండి అంటూ వర్మ తాగి వాగిన ఆడియోను ట్విట్టర్లో రిలీజ్ చేసారు.

వర్మ స్పందిస్తూ....

నేను ఏదో సరదాగా ఆ ట్వీట్స్ చేసాను. నా వల్ల ఇరిటేషన్ కు గురైన విద్యుత్ జామ్ వాల్, టైగర్ ష్రాఫ్ లకు క్షమాపణ చెబుతున్నాను అని వర్మ ట్వీట్ చేసారు.

వోడ్కా మానేస్తున్నా

ఇప్పటి నుండి వోడ్కా మానేయాలని నిర్ణయించుకున్నాను. నా వల్ల ఇబ్బంది పడ్డవాళ్లంతా నన్ను క్షమించండి 'అంటూ ట్వీట్ చేశాడు.

పవన్ కళ్యాణ్ అభిమానులకు క్షమాపణ

నేను ఇకపై వోడ్కా తాగను. ఇప్పటి వరకు నా వల్ల బాధు గురైన వారందరికీ.... గణపతి భక్తులు, పవన్ కళ్యాణ్ అభిమానులతో సహా అందరికీ క్షమాపణలు చెబుతున్నాను అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు.

మా అమ్మమీద, స్టీవెన్ స్పీల్ బర్గ్ మీద, సీనియర్ బచ్చన్ మీద ఒట్టు

నేను దేవుణ్ని నమ్మను కాబట్టి నా మాటలు మీరు నమ్మకపోవచ్చు అందుకే ఈసారి మా అమ్మ మీద, దర్శకుడు స్పీల్ బర్గ్ మీద, బాలీవుడ్ మెగాస్టార్ సీనియర్ బచ్చన్ మీద ఒట్టేసి చెపుతున్నా' అంటూ ట్వీట్ వర్మ చేశాడు.

English summary
"Just decided to get off Vodka and also want to apologise to every1 i evr bothered including Lord Ganpati's devotees nd PawanKalyan 's fans. For all those who are disbelieving my vow,since I don't believe in God,I hearby swear on my mother,Steven Spielberg and SrBachchan" RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu