రెండు కళ్లు పోయేలా ఉన్నాయి: ఆర్జీవీ ఫోటో మీద సెటైర్లు
ఆర్జీవీ "అర్జున్ రెడ్డి"గా మారాడు. ఫన్నీగా తన ఎఫ్‌బిలో ఓ పోస్టు చేశాడు.
Recommended Video

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. సినిమాలోని కొన్ని సీన్లపై వివాదాల సంగతి పక్కన పెడితే... ఇండస్ట్రీ ప్రముఖుల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఇక 'అర్జున్ రెడ్డి' సినిమాను టార్గెట్ చేసిన వారిని.... టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగిన రామ్ గోపాల్ వర్మ అప్పట్లో సోషల్ మీడియాలో ఆ సినిమాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు 'శివ' ట్రెండ్ సెట్టర్ అయితే, ఇపుడు 'అర్జున్ రెడ్డి' ట్రెండ్ సెట్టర్ అంటూ ప్రశంసించారు.

‘రామ్ గోపాల్ రెడ్డి' లుక్
తాజాగా సోషల్ మీడియాలో వర్మ...... తాను అర్జున్ రెడ్డి అయితే ఎలా ఉంటుందో చూపిస్తూ ఓ ఫన్నీ పిక్ పోస్టు చేశారు. దానికి ‘రామ్ గోపాల్ రెడ్డి' అనే టైటిల్ పెట్టారు. ఇపుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అభిమానుల నుండి ఫన్నీ కామెంట్స్
ఈ పిక్ పోస్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే అభిమానుల నుండి ఊహించని స్పందన వచ్చింది. వందలాది కామెంట్స్, షేర్స్, వేలాది లైక్స్ వెల్లువెత్తాయి. అదే సమయంలో కొందరు సెటైర్లు వేశారు.

రెండు కళ్లు పోయేలా ఉన్నాయి
‘రామ్ గోపాల్ రెడ్డి' లుక్ చూసిన కొందరు రెండు కళ్లు పోయేలా ఉన్నాయంటూ సెటైర్లు.

ఫేస్ బుక్ టాపర్
రామ్ గోపాల్ వర్మ ఫేస్ బుక్, ట్విట్టర్లలో టాపర్ అంటూ మరో కామెంట్.

ఇలాంటివే తగ్గించుకుంటే మంచిది
ఇలాంటివే తగ్గించుకుంటే మంచిది అంటూ మరో అభిమాని సలహా.


Click it and Unblock the Notifications











