గౌతమ్ మీనన్ సినిమా అందుకే వదిలేసా...రామ్
గౌతమ్ మీనన్ సినిమా నుంచి హీరో రామ్ బయిటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దానికి కారణం ఇగో దెబ్బతినటమేనంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రామ్ క్లారిఫికేషన్ ఇచ్చారు. రామ్ మాటల్లోనే...నేను మొదట గౌతమ్ మీనన్ సినిమాలో హీరో అయినందుకు చాలా ఆనందపడ్డాను. నాతో మొదట మీటింగ్ కాగానే నాతో సినిమా చేస్తానని ఆయన ప్రకటించటంతో నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. నా దగ్గర ఒక సినిమా చేయటానికి డేట్స్ ఉన్నాయి.అయితే ఆయన బై లింగ్వుల్ అన్నారు. అయితే చివరి నిముషంలో ట్రైలింగ్వల్ సినిమా అని తేల్చారు. దాంతో నాకు ఎందుకంటే ప్రేమంటా సినిమాకు డేట్స్ క్లాష్ వస్తున్నాయి. దాంతో నేను చాలా డిజప్పాయింట్ అయ్యాను.ఇప్పుడు నా శక్తి ,ఎనర్జి మొత్తం ఎందుకంటే ప్రేమంటా చిత్రానికే. మరో సారి చెప్తున్నాను...మా మధ్య ఇగో క్లాషెష్ లేవు..నో డ్రామా...నో మశాలా...కేవలం డేట్స్ ఇష్యూలు మాత్రమే అన్నారు.
అయితే అస్సలు కారణం వేరే అని చెప్తున్నారు. గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని మూడు భాషల్లో తీస్తున్నారు.తెలుగుకు రామ్ హీరో అయితే హిందీకి ఆదిత్యారాయ్, తమిళంలో జీవా చేస్తున్నారు. వీరి ముగ్గురు చేతా సీన్స్ ఒకేసారి చిత్రీకరిస్తున్నారు.సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో ఏ భాషకు తగినట్లు అలా ప్యాడింగ్ ఆర్టిస్టులు మారిపోతారు. ఈ నేపధ్యంలో చాలా సమయం తీసుకుంటోంది. మిగతా ఇద్దరితో సీన్ తీసి తన దగ్గరికి వచ్చేటప్పటికి చాలా సమయం పట్టడం రామ్ ని అసహనానికి గురి చేసింది.దాంతో అతను కోపంగా సెట్స్ మీదనుంచి బయిటకు వచ్చేసారు. తను ఖాళీగా అంతసేపు కూర్చోటేవటం రామ్ కి నచ్చలేదుట. దాంతో గౌతమ్ మీనన్ కి ఈ విషయం చెప్పినా ఆయన మొదటే ముగ్గురుతో ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పాను కదా తప్పదని తేల్చేసారు. ఇక ఈ విషయమై చెన్నై మీడియా వారు గౌతమ్ మీనన్ ని సంప్రదించగా...ఈ విషయమై ఇప్పుడే మాట్లాడటం భావ్యం కాదు..నేను పరిస్ధితులు అన్నీ చక్కబడతాయనే అనుకుంటున్నాను అన్నారు. అలాగే ఈ చిత్రంలో హీరో ఇంజనీరింగ్ స్టూడెంట్ గా కనిపిస్తారు. సమంత సైకాలజి స్టూటెండ్ గా కనిపించనుంది.


Click it and Unblock the Notifications











