తను నాలాగే తప్పుల నుంచి: కాజల్
నాలాగే తను కూడా తను చేసే తప్పుల నుంచి నేర్చుకుంటూ ఎదగాలి అంటోది కాజల్.ఇంతకీ ఎవరు ఆ ఎదగాల్సిన వ్యక్తి అంటే నిషా అగర్వాల్ గురించి. ఆమె కాజల్ చెల్లెలు. మీ చెల్లెలుకు మీరు పరిశ్రమలో సెటిల్ అవ్వటానకి సలహాలు ఏమీ ఇవ్వరా అంటే ఇలా స్పందించింది. అలాగే నా చెల్లెలు ఇండిపెండెంట్ గా ఎదగటమే మా ఇంట్లో వాళ్ళం కోరుకుంటోంది అంది. ఇక మీ చెల్లెలు మీకు పోటీగా ఫీల్ అవుతున్నారా అంటే..దానకి ఆమె...అందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు.ఎక్కడన్నా నా బేబీ నాకు పోటీ అవుతుందా అంది. ఇక ఆమె నటించిన హిందీ సింగం చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది. తెలుగులోనూ నాగచైతన్య సరసన చేస్తున్న దడ చిత్రం షూటింగ్ లో ఆమె రీసెంట్ గా పాల్గొని వచ్చింది.


Click it and Unblock the Notifications











