twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా కాంపౌండ్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇక ఏపీ సినిమా టికెట్లు అన్నీ వారి చేతుల్లోనే?

    |

    తెలుగు సినిమా పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల విషయంలో కొంత ఊరట లభించే విధంగా రేట్లు పెంచింది. గతంలో పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో టికెట్ రేట్‌ను పెంచుకొనే అవకాశం ఎలా ఉండేదో అలాగే అవకాశం కల్పిస్తూ ఒక కొత్త జీవో తెచారు. రేట్లు కూడా కొంత మేర పెంచారు. అయిత ఇప్పుడు ఆన్ లైన్ టికెట్స్ కి సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

    Recommended Video

    AP Tickets Issue : Just Tickets To Sell Online Tickets In AP Behalf Of Govt | Oneindia Telugu
    ఆన్ లైన్ టికెట్లు అమ్మకాలు

    ఆన్ లైన్ టికెట్లు అమ్మకాలు

    సినిమా పరిశ్రమలో నిర్మాతలు చెప్పే కలెక్షన్లకు, చెల్లించే జీఎస్టీకి పొంతన ఉండటం లేదని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు సక్రమంగా రాబట్టుకొని, పన్ను ఎగవేత జరగకుండా చర్యలు తీసుకుంటాం అని అప్పట్లో ప్రభుత్వం పేర్కొంది. అప్పుడే సినిమా టికెట్ల ఆన్ లైన్ విధానం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. గతంలోనే ప్రభుత్వం ద్వారా ఆన్ లైన్ టికెట్లు అమ్మకాలు సాగించేలా జీవో నెం. 142 జారీ చేసింది.

    ఏపీఎఫ్డీసీ ఆధ్వర్యంలో

    ఏపీఎఫ్డీసీ ఆధ్వర్యంలో

    ఆ జీవో ప్రకారం ఆన్ లైన్ టికెట్ల అమ్మకాల బాధ్యతలు ఏపీ ఎఫ్డీసీ(ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్)కి అప్పగిస్తున్నట్లు జీవోలో పేర్కొంది. జనవరి 1 నుంచి ఐఆర్సీటీసీ తరహాలో కొత్త వెబ్ సైట్ ఒకటి రూపొందించి ఏపీఎఫ్డీసీ ఆధ్వర్యంలో టికెట్లను విక్రయించనున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మరో విషయం తెరమీదకు వచ్చింది.

     టెండర్ల ప్రక్రియ

    టెండర్ల ప్రక్రియ

    తాజా సమాచారం మేరకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏపీలో సినిమా టిక్కెట్లను ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చిన పోర్టల్ మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. ఏపీ ఫిల్మ్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్ కింద ఆన్ లైన్ టిక్కెట్లు అమ్మాలనుకున్నారు కానీ ఏపీఎఫ్‌డీసీ సొంత పోర్టల్ రూపొందించలేదు. ఇప్పటికే ఉన్న పోర్టళ్లకు అవకాశం ఇవ్వాలని టెండర్లు పిలిచింది. ఈ టెండర్ల ప్రక్రియ దాదాపు పూర్తయిందని అంటున్నారు. ఏ క్షణమైనా టెండర్‌ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

    అల్లు అరవింద్ కుమారుడు

    అల్లు అరవింద్ కుమారుడు

    ఇక ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో బుక్ మై షో, పేటీఎం, జస్ట్ టికెట్ లాంటి సంస్థలు పాల్గొనగా అందులో జస్ట్ టికెట్ ఎల్ 1 గా నిలిచినట్లు తెలుస్తోంది. చెన్నై కేంద్రంగా పని చేస్తున్న జస్ట్ టిక్కెట్ సంస్థలో అల్లు అరవింద్ కుమారుడు అల్లు వెంకటేష్(బాబీ)ఓ డైరెక్టర్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన గని సినిమాను నిర్మించారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ బిజినెస్ ప్రారంభమైనప్పుడు జస్ట్ టిక్కెట్ ఏపీలో చాలా సినిమా ధియేటర్లలో టిక్కెట్లను బుక్ చేసేది. అయితే తర్వాత పేటీఎంతో పాటు బుక్ మై షో లాంటి సంస్థలు రావడంతో జస్ట్ టికెట్ వెనుకబడింది కానీ రన్నింగ్ లోనే ఉంది.

    ఏప్రిల్ 1 తర్వాత

    ఏప్రిల్ 1 తర్వాత

    ఇప్పుడు ఏపీలో సినిమా టిక్కెట్ల కాంట్రాక్ట్‌ను ఈ సంస్థ పొందిందని అంటున్నారు. జస్ట్ టిక్కెట్‌కు ఏపీ ప్రభుత్వ అధికారిక టికెట్ బుకింగ్ గెట్‌వేగా కాంట్రాక్ట్ ఇస్తున్నట్లుగా ఏ క్షణమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల అంచనా. ఏప్రిల్ 1 తర్వాత ఏపీలో ఎక్కడ సినిమా చూడాలన్నా జస్ట్ టికెట్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. ధియేటర్లలో బుకింగ్‌లు కూడా ఆ పోర్టల్ ద్వారానే చేసే అవకాశం ఉంది.

    English summary
    As per trusted sources Just tickets to sell online tickets in andhra pradesh behalf of government.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X