twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #JusticeForChaithra..పవన్ కల్యాణ్ అండగా నిలువండి.. పవర్ స్టార్ మద్దతు కోరిన చైత్ర కుటుంబ సభ్యులు

    |

    సభ్య సమాజం తలదించుకొనేలా హైదరాబాద్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకోవడంపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నది. హైదరాబాద్‌‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి చైత్రపై జరిగిన హేయమైన లైంగికదాడిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన నిందితుడు కోసం తెలంగాణ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో చైత్ర కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు ప్రభుత్వానికి విన్నపాలు సమర్పిస్తున్నారు. ప్రజలను, సామాజిక కార్యకర్తలు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు అండగా నిలువాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను చైత్ర కుటుంబ సభ్యులు కోరడం చర్చనీయాంశమైంది. చైత్ర కేసు. వారి కుటుంబ సభ్యుల చేసిన వినతి గురించిన వివరాల్లోకి వెళితే..

     చైత్ర కేసులో నిందితుడి ఆనవాళ్లు ఇవే..

    చైత్ర కేసులో నిందితుడి ఆనవాళ్లు ఇవే..

    చైత్ర లైంగిక దాడి కేసుపై తెలంగాణ పోలీస్ శాఖ స్పందించింది. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ.. చైత్ర కేసులో నిందితుడు పల్లకొండ రాజు పారిపోయాడు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ (ఈస్ట్ జోన్) పరిధిలోని జరిగిన చైత్ర రేప్, హత్య కేసులో అతడు నిందితుడు. అతడి వయసు 30 సంవత్సరాలు. అతడి ఎత్తు 5.9 అడుగులు. పొడవైన జుట్టు, నెత్తికి రబ్బర్ కట్టుకొని ఉన్నాడు. నెత్తిన టోపి, మెడకు రుమాలు చుట్టుకొన్నాడు. కొంచెం గడ్డం ఉంది. ఫార్మాల్ ప్యాంట్, షర్ట్ వేసుకొన్నాడు. మద్యం సేవించి, రోడ్డు పక్కన పేవ్‌మెంట్‌పై పడుకొంటాడు అని తెలంగాణ ఓ ప్రకటనను విడుదల చేసింది.

    1000000 రివార్డు ప్రకటించిన తెలంగాణ పోలీసులు

    1000000 రివార్డు ప్రకటించిన తెలంగాణ పోలీసులు

    చైత్ర రేప్, మర్డర్ కేసు విచారణను, నిందితుడిని పట్టుకోవడానికి తెలంగాణ పోలీసులు తమ చర్యలను వేగవంతం చేశారు. నిందితుడి ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని సూచించారు. నిందితుడి ఆనవాళ్లను చెబుతూ వాంటెడ్ నోటీస్ జారీ చేశారు. ఈ కేసులో ప్రజలు సహకరించాలని కోరారు. అంతేకాకుండా నిందితుడిని పట్టించిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటనలో తెలిపారు.

    #JusticeForChitra హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్

    #JusticeForChitra హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్

    ఇది ఉండగా, చైత్ర ఘటనపై నిరసనలు, ఆందోళనలు భారీగా కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ దారుణ ఘటనపై నెటిజన్లు స్పందిస్తుండటంతో #JusticeForChitra అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్నది. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని, లేదా కఠిన శిక్ష విధించాలని రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మానవత్వం మంటకలిసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసు విభాగంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

    చైత్ర కుటుంబానికి మద్దతుగా

    చైత్ర కుటుంబానికి మద్దతుగా

    ఇక చైత్ర కుటుంబాన్ని సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు స్వయంగా కలిసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచు మనోజ్ స్వయంగా వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబంలో నెలకొన్న పరిస్థితిని చూసి తల్లడిల్లిపోతున్నారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు పలువురిని ఆర్థిస్తున్నారు.

    Recommended Video

    Sushant Singh Rajput Pet Dog Fudge Heart Breaking Moments

    పవన్ కల్యాణ్ మద్దతు కోసం చైత్ర కుటుంబ సభ్యులు

    ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో చైత్ర కుటుంబ సభ్యులు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సహాయాన్ని కోరారు. చైత్ర కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. అయ్యా పవన్ కల్యాణ్ గారు.. మీరు వచ్చి మాకు అండగా నిలువండి. మాకు మద్దతు తెలియజేస్తే పదిమందికి తెలుస్తుంది. ఈ విషయం అందరికి తెలిసి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో మా కుటుంబానికి న్యాయం జరుగుతుంది అని పవన్ కల్యాణ్‌ను కుటుంబ సభ్యులు కోరారు. అయితే పవన్ కల్యాణ్ ఈ దారుణ సంఘటనపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

    English summary
    Justice For Chaithra hash Tag is trending in twitter. Hyderabad Police Commissioner announced 1000000 reward on Accused. In this occassion, Victim family seeks Pawan Kalyan support in this incident.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X