సినీ జనాలను టెన్షన్ పెడుతున్న బ్యాట్మింటన్ పాప!
బ్యాట్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా ఈ మధ్య తరచూ సినీ జనాలను తెగ టెన్షన్ పెడుతోంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో ఏ సినిమా ఫంక్షన్ జరిగినా అక్కడ దర్శనం ఇస్తున్న జ్వాలా....అప్పుడప్పుడు హాట్ హాట్ డ్రెస్సులతో ఎంట్రీ ఇస్తూ సదరు సినిమా హీరోయిన్లు సైతం కుళ్లుకునేలా ప్రవర్తిస్తోంది.
భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్న జ్వాల సినిమాల్లో నటించే ఆలోచనలో ఉన్నట్లు గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. దీనికి తోడు తరచూ ఆమో సినిమా ఫంక్షన్లలో దర్శనం ఇస్తుండటం కూడా పై వాదనకు బలం చేకూరుస్తోంది.
నిన్న జరిగిన బాడీగార్డ్ ఆడియో ఫంక్షన్ లోనూ జ్వాలా బ్లాక్ డ్రెస్ లో సెక్సీగా తయారై వచ్చింది. దర్శకుల పక్కనే తిష్ట వేయడంతో మరోసారి అందరిలోనూ టెన్షన్. ఈవిడ సినిమాల్లోకి వస్తోందా? వస్తే ఎలా ఎంట్రీ ఇవ్వబోతోంది? అనే అంశాలు మళ్లీ చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











