Don't Miss!
- News
Chain Snatching: ఫుడ్ డెలివరీ బాయ్‌గా వచ్చి చైన్ స్నాచింగ్..
- Sports
IND vs NZ మూడో టీ20లో పృథ్వీ షాను ఖచ్చితంగా ఆడించాలి! ఎందుకంటే..?
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Lifestyle
Garuda Purana: ఈ పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలి.. లేదంటే సమస్యలు తప్పవు
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Technology
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
విశాల్‌తో గుత్తా జ్వాల పబ్లిక్ కిస్.. డేటింగ్ కన్ఫర్మ్! నెట్టింట వైరల్ పిక్స్
Recommended Video
తమిళ నటుడు విష్ణు విశాల్‌తో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ముద్దులో మునిగిపోవడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఇద్దరూ కలిసి లిప్ లాక్ చేసుకోవడమే గాక అది పబ్లిక్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. దీంతో విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల డేటింగ్ వ్యవహారం కన్ఫర్మ్ అయినట్లే అనే టాక్ వినిపిస్తోంది. వివరాల్లోకి పోతే..

ప్రైవేట్ పిక్స్‌ని పబ్లిక్ చేసింది
న్యూ ఇయర్ సందర్భంగా విషెస్ తెలుపుతూ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తన ప్రైవేట్ పిక్స్‌ని పబ్లిక్ చేసింది. తమిళ హీరో విష్ణు విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను గుత్తా జ్వాల తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది. ఇందులో గుత్తా జ్వాలకు విశాల్ ముద్దు పెడుతున్నట్లు కనిపించడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

డేటింగ్‌లో ఈ ఇద్దరూ..
విష్ణు విశాల్‌తో అత్యంత సన్నిహితంగా దిగిన ఈ ఫోటోలు.. వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందని చెప్పకనే చెబుతున్నాయి. ఇద్దరూ డేటింగ్‌లో మునిగితేలుతూ ఎంజాయ్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కొందరైతే ఏకంగా 'ఓహో.. విష్ణు విశాల్ భార్యతో విడాకులు తీసుకోవడానికి కారణం ఇదా..?' అని కామెంట్ చేస్తుండటం విశేషం.

విడిపోయి ఒక్కటవుతున్న జంట.. ఎఫైర్ నిజమే
గత కొంతకాలంగా విష్ణు విశాల్- గుత్తా జ్వాల నడుమ ఏదో నడుస్తోందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా గుత్తా జ్వాలనే ఈ ఫొటోలు షేర్ చేయడంతో ఇద్దరి మధ్య ఎఫైర్ నిజమే అని ఫిక్స్ అవుతున్నారంతా. 'ఈ జోడి ఎంతో క్యూట్ అండ్ హాట్' అని, 'విడిపోయి ఒక్కటవుతున్న జంట' అని రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

గతంలో గుత్తా ప్రేమ వివాహం
గతంలో గుత్తా జ్వాల మరో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పలు విభేదాల కారణంగా ఈ జంట విడిపోయారు. వీరిద్దరూ విడిపోవడానికి టీమిండియాకు చెందిన ఓ మాజీ క్రికెటర్ అని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ వార్తలను గుత్తా జ్వాలా కొట్టిపారేశారు.

విష్ణు విశాల్ పరిస్థితి కూడా అదే
మరోవైపు హీరో విష్ణు విశాల్ గత జూన్‌లో తన భార్య రజనీతో విడిపోయిన విషయం తెలిసిందే. సో ఈ ఇద్దరూ విడివిడిగా విడిపోయి ఇప్పుడు ఒక్కటవుతున్నారన్నమాట. తమిళంలో విష్ణు విశాల్ ఇప్పటివరకూ 14 సినిమాల్లో నటించాడు.