twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ :‘జ్వాలా గుత్తా’ కొత్త సెక్సీఫోజ్ (ఫోటో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : నితిన్ హీరోగా రూపొందుతున్న చిత్రం గుండె జారి గల్లంతయ్యిందే. ఈ చిత్రంలో ఓ పాటలో గుత్తా జ్వాల కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ నేఫద్యంలో సినిమా వాళ్ల దృష్టి అంతా ఆమెపైనే ఉంది. దానికి తగినట్లుగానే ఆమె తన సెక్సీ ఫోజ్ లతో హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా ఆమె ఇచ్చిన ఓ స్టిల్ అంతటా చర్చనీయాంసమైంది.

    సినిమాలో ఓ పాట చేయమని అడిగితే తొలుత తాను సరదాగా ఆటపట్టించేందుకు జోక్ చేస్తున్నారేమోనని అనుకున్నానని కానీ, పాట విన్నాక తనకు చేయాలనిపించిందని బ్యాడ్మిండన్ క్రీడాకారణి గుత్తా జ్వాల చెప్పారు. సినిమాల్లో నటించేందుకు గుత్తా జ్వాలా కొంతకాలంగా ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఆమె సినిమాల్లో నటించే ఆసక్తి ఉందని గతంలో చెప్పినప్పటికీ నటిస్తుందా? లేదా? అనే చర్చ జరిగింది.

    ఆ చర్చకు గుత్తా జ్వాల ఫుల్ స్టాప్ పెట్టించారు. గుత్తా జ్వాల ఎటువంటి హంగామా లేకుండా సినిమా షూటింగు కానిచ్చేస్తోంది. నితిన్ హీరోగా రూపొందుతున్న చిత్రం గుండె జారి గల్లంతయ్యిందే. ఈ చిత్రంలో ఓ పాటలో గుత్తా జ్వాల కనిపించనుంది. తనకు అవకాశం ఎలా వచ్చిందన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు.

    హీరో నితిన్, నిర్మాత నిఖితా రెడ్డి ఇద్దరూ తనకు మంచి స్నేహితులని, తమ సినిమాలో ఓ పాట చేయాలని అడిగారన్నారు. అయితే వారు తనతో జోక్ చేస్తున్నారని తొలుత అనుకున్నానని, ఆ తర్వాత పాట విని ఒప్పుకున్నానని చెప్పారు. తొలి రోజు షూటింగ్‌లో కొద్దిగా భయమేసిందని, సెట్‌లో చాలామంది ఉన్నారని చెప్పారు. అంతమంది మధ్య డాన్స్ చేయడం తనకు కొత్త అనుభవాన్ని ఇచ్చిందన్నారు. ఈ నృత్యాల కోసం వారం రోజుల పాటు రిహార్సల్స్ చేశానని చెప్పారు. ఏదేమైనా ఇది చాలా సరదాగా ఉందని జ్వాలా చెప్పారు. సినిమాలలో నటిస్తున్నప్పటికీ తన తొలి ప్రాధాన్యం బ్యాడ్మింటన్‌కేనని జ్వాల స్పష్టం చేశారు.

    English summary
    Jwala recently completed her first song performance in Nithin's Gunde Jaari Gallanthainde which is set for release coming April. Jwala Gutta is seriously preparing for her grand debut as heroine. She is trying to be back in shape and she looks sizzling in her new avatar. Check the above photograph.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X