ఝలక్....రియాల్టీ షోకు నో చెప్పిన గుత్తా జ్వాల
తాజాగా ఆమె తెలుగు సినిమాల్లో నటించడం మొదలు పెట్టడంతో పాటు, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంలో స్పెషల్ ఐటం సాంగు కూడా చేయడంతో మరోసారి 'ఝలక్ ధిక్లా జా' షో నిర్వాహకులు ఆమెను సంప్రదించారు. అయితే ఈ సారి కూడా ఆమె ఆ షోలో పాల్గొనడానికి ఇష్టపడలేదు.
రాబోయే జులై, ఆగస్టు నెలల్లో వరుస బాడ్మింటన్ టోర్నమెంట్లు ఉండటంతో తన సమయాన్ని ఎక్కువగా ప్రాక్టీసుకే వినియోగించాలని నిర్ణయించుకుంది జ్వాలా. ఈ నేపథ్యంలో వారికి నో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే భవిష్యత్ పరిస్థితులు అనుకూలిస్తే తప్పకుండా చేస్తానని వారికి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆ సంగతి పక్కన పెడితే తాజాగా జ్వాలా గుత్తాపై ఫిల్మ్ నగర్లో ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రాణె(తకిట తకిట ఫేం)తో కొన్ని రోజులుగా జ్వాలా చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంది. ఎక్కడికెళ్లినా ఇద్దరు జంటగా వెలుతున్నారు. దీంతో ఫిల్మ్ నగర్లో వీరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు గుప్పుమన్నాయి.


Click it and Unblock the Notifications












