గ్లామరే తప్ప...విషయం లేని గుత్తా జ్వాలా!
హైదరాబాద్ : బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా నితిన్ కథానాయకుడుగా రూపొందిన 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం శనివారం విడుదలైంది. ఈచిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో కనిపించిన గుత్తా జ్వాలా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది.
ఇటీవల కాలంలో ఆమె ఏ సినిమా ఫంక్షన్‌కు, ఇతర కార్యక్రమాలకు హాజరైనా మోడ్రన్ డ్రెస్సుల్లో హాట్ అండ్ సెక్సీగా ఒంపు సొంపులతో అందరి చూపులను ఆకట్టుకునేది. దీంతో గుత్తా జ్వాలా సినిమాలో కనిపించడం ద్వారా సినిమాకు ప్లస్సవుతుందని అంతా అనుకున్నారు. అయితే ఆమె అప్పియరెన్స్ సినిమాకు ఏ మాత్రం ప్లస్ కాకపోగా మైనస్ అయింది.
ఆమెకు గ్లామర్ ఉందే తప్ప నటించడం, హావభావాలు పలికించడం చేతకాదని ఈ సినిమాతో స్పష్టమైంది. కొందరైతే బొద్దుగా ఉండే ఆమె పర్సనాలిటీని కూడా ఇష్ట పడటం లేదు. సో...ఇకపై ఆమెను సినిమాల్లోకి తీసుకునే సాహసం ఎవరూ చేయక పోవచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు.
కాగా...శనివారం విడుదలైన 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో నితిన్, నిత్యా మీనన్ పెర్ఫార్మెన్స్, వారి మధ్యా సాగే కామెడీ రొమాంటిక్ ట్రాక్, కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. విక్రమ్ గౌడ్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయకుమార్ కొండా దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











