జ్వాల గుత్తా చెల్లి కూడా...రంగుల ప్రపంచంలోకి
తాజాగా అందుతున్న హాట్ న్యూస్ ఏమిటంటే జ్వాల గుత్తా చెల్లెలు ఇన్సి గుత్తా కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. అక్క కంటే ముందే వెండితెరపై వెలగబోతోంది. మధుర శ్రీధర్ దర్శకత్వంలో రాబోతున్న 'బ్యాక్ బెంచ్ స్టూడెంట్' చిత్రం ద్వారా వెండితెర ఆరంగ్రేటం చేయబోతోంది.
మాస్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఇన్సి గుత్తాకు సినిమాలంటే మహా పిచ్చి అని, అక్క జ్వాలకు సినిమా వాళ్లతో దగ్గరి పరిచయాలు ఉండటంతో ఎలాగో అలా సినిమాల్లో నటించే అవకాశం చాలా వీజీగానే దక్కించుకుందని ఫిల్మ్ నగర్ టాక్. అన్నట్లు ఆమె ఈ సినిమాలో హీరో మహత్ రాఘవేంద్రకు ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించబోతోంది.
ఇన్సి గుత్తా గురించి దర్శకుడు మధు శ్రీధర్ మాట్లాడుతూ...'ఆమె తొలుత అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలని నాదగ్గరకొచ్చింది. అయితే ఆమె నా సినిమాలో ఓ క్యారెక్టర్‌కి బాగా సెట్టవుతుందని అనిపించింది. వెంటనే ఆమెతో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేయించాను. తెలంగాణ యాసలో ఆమె పాత్ర మంచి వినోదాన్ని పంచుతుంది. సెట్స్‌లో ఇన్సి గుత్త చాలా ఫన్నీగా ఉండేది' అని చెప్పకొప్పుకొచ్చారు.
బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఈచిత్రం ఈ నెల 15న విడుదల కాబోతోంది. ఈచిత్రం ద్వారా మహత్ రాఘవేంద్ర(తాప్సి మాజీ ప్రియడు) హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈచిత్రంలో పియా బాజ్ పాయ్, అర్చన కవి హీరోయిన్లు. మల్టీ డైమన్షన్ ప్రై.లి సమర్పిస్తోంది. షిరిడీ సాయి కంబైన్స్ పతాకంపై ఎం.వి.కె.రెడ్డి నిర్మించారు.


Click it and Unblock the Notifications












