నితిన్ సినిమాతో జ్వాలా గుత్తా ఎంట్రీ, ఐటం సాంగులోనా?
హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్త టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ఆమె తరచూ సినిమా ఫంక్షన్లలో సెక్సీ డెస్సులతో తళుక్కుమనడం, సినిమా సెలబ్రిటీలతో సన్నిహితంగా మెలుగుతుండటం ఆ వార్తలకు బలం చేకూరినట్లయింది.
తాజాగా జ్వాలా గుత్త సినిమా ఎంట్రీ రంగం సిద్ధమైంది. నితిన్ హీరోగా రూపొందుతున్న 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రంలో ఆమె స్సెషల్ సాంగులో కనపడనుంది. ఈ విషయాన్ని నితిన్ తో పాటు, జ్వాలా గుత్త కూడా తమ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసారు.
మరీ ఆమె కనిపించబోయే ఆ స్పెషల్ సాంగు ఐటం సాంగా? లేక మరోలా ఉంటుందా? అనేది సినిమా విడుదలైతేగానీ చెప్పలేం. 'గుండె జారి గల్లంతయ్యిందే' సినిమా విశేషాల్లోకి వెళితే...ఇష్క్' చిత్రంలో తనతో జోడి కట్టిన నిత్య మీనన్‌తో నితిన్ మరోసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇషా తల్వార్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. 'ఇష్క్'కు విజయవంతమైన పాటలను అందించిన అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా విజయ్ కుమార్ కొండ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో ఇషా తల్వార్, మధు నందన్, రఘుబాబు, తాగబోతు రమేష్, అలీ, ఆహుతి ప్రసాద్, సుధ, సంధ్యా జనక్ నటిస్తున్నారు. సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఆండ్రూ బాబు.ఐ, ఎడిటర్: ప్రవీన్ పూడి, లిరిక్స్: కృష్ణ చైతన్య, శ్రీమణి, ఆర్ట్స్ రాజీవ్ నాయర్, మాటలు-స్క్రీన్ ప్లే: హర్ష వర్ధన్, నిర్మాత: నిఖితా రెడ్డి, కథ-దర్శకత్వం: విజయ్ కుమార్ కొండ.


Click it and Unblock the Notifications











