పూరి-ఛార్మి.... ‘జ్యోతిలక్ష్మి’ ఫస్ట్ లుక్ అదిరింది (ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్ : ఛార్మి, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘జ్యోతిలక్ష్మి' . షూటింగ్ మొదలు పెట్టిన రెండు నెలల్లోనే పూరి షూటింగ్ పూర్తి చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేసారు. ఫస్ట్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రం తో ఛార్మీ కి మాస్ ఇమేజ్ తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. ఫిబ్రవరి 20న మొదలైన ఈ సినిమా షూటింగ్ కంటిన్యూ షెడ్యూల్ తో ఏప్రిల్ 29తో ముగిసింది.

ఈ చిత్రంలో ఛార్మి టైటిల్ పాత్రలో పోషిస్తోంది. అయితే ఈ సినిమాలో ఛార్మి సెక్స్ వర్కర్‌గా కనిపించనుందని సమాచారం. ఓ సెక్స్ వర్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం జ్యోతిలక్ష్మి. మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి 'మిసెస్ పరాంకుశం' అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది.

Jyothi Lakshmi Movie First Look Launch

ఈ నవలలో మిసెస్ పరాంకుశం అనే ఓ సెక్స్ వర్కర్ పెళ్లి చేసుకొని తన జీవితాన్ని ఎలా గడుపుతుందనే అంశం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదే కథను కొన్ని మార్పులతో 'జ్యోతిలక్ష్మి'గా తెరకెక్కిస్తున్నారట. మరి పూరి, ఛార్మిని ఏరకంగా చూపిస్తారో వేచి చూడాలి.

ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఓ హార్డ్ హిట్టింగ్ పాయింట్ తో పూరి ఈ సినిమా తీసాడని చెప్తున్నారు. చార్మీతో పాటు సత్య, వంశీ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ సినిమాకి పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తే, సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. సికె ఎంటర్ టైన్మెంట్స్ మరియు శ్రీ సుభ శ్వేతా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి ఛార్మీ సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X