బిజినెస్ మ్యాన్ లో లేడీ గ్యాంగస్టర్ గా ఆమె
బెల్ట్ నికాల్.. నికాలరే.. నువ్వేంట్రా ఇంత కసిగా ఉన్నావు.. దేముడు అన్నీ నీకు ఇచ్చాడు.. ఆడుకుందామా అంటూ పోకిరిలో మహేష్ ని ఉద్దేశించి చెప్పే లేడీ గ్యాంగస్టర్ డైలాగు గుర్తిండే ఉంటుంది. ఆ పాత్రలో కనిపించిన ఆ హస్కీ భామ పేరు జ్యోతి రానా. ఆమె పోకిరి తర్వాత రెండు మూడు ఆఫర్స్ వచ్చినా అవన్నీ లేడీ గ్యాంగ్ స్టర్ గానో లేక ఐటమ్ గర్ల్ గానో రావటంతో ఆమె నిలదొక్కుకోలేకపోయింది. మళ్లీ ఇన్నాళ్లుకూ జ్యోతీ రానా మళ్లీ ది బిజినెస్ మ్యాన్ చిత్రంలోనూ కనిపించనుంది. పూరీ ఆమెతో మళ్లీ మ్యాజిక్ చేయటానికి పూనుకున్నారు. ఆమె పాత్ర బిజినెస్ మ్యాన్ లోనూ హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. బిజినెస్ మ్యాన్ సెట్లో మహేష్ తో కలిసి ఫోజులిచ్చిన స్టిల్ ఇప్పుడు అంతటా మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది. ఆమె ఈ చిత్రం విడుదలైతే తన డైరీ ఫుల్ గా ఉండి బిజీ అయిపోతానని భావిస్తోంది.
ఇక మరో ప్రక్క బిజినెస్ మ్యాన్ చిత్రానికి వర్మ సైతం పబ్లిసిటీ క్యాంపైన్ నిర్వహిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు, పూరీ డైలాగులు, డైరక్షన్ సెక్స్ కన్నా చాలా బెస్ట్ అంటూ రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్వీట్ చేసారు. అలాగే బిజినెస్ మ్యాన్ లో డైలాగులుని తీసుకుని దాన్ని మార్చి ఆయన ట్వీట్ చేసిన విధానం కూడా చాలా మందికి నచ్చుతోంది. అదేమిటంటే.. ఎక్కువ సినిమాలతో బిజెనెస్ మ్యాన్ ని రౌండప్ చేస్తే కన్ఫూజన్ లో ఇంకా ఎక్కువ రికార్డులు బ్రద్దలు కొట్టేస్తుంది అంటూ ట్విట్టర్ లో రాయటం చాలా మంది మహేష్ అభిమానులును ఆకట్టుకుంది. రీసెంట్ గా పూరీ ఈ చిత్రానికి సంభందించిన రషెష్ ని రామ్ గోపాల్ వర్మకు చూపించటం జరిగిందని, అది చూసిన వర్మ ఇలా ఉత్సాహంతో ట్వీట్ చేసారని చెప్తున్నారు. అలా ఈ చిత్రానకి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











