Killer Glimpse Review: కిల్లర్ గ్లింప్స్.. లుక్స్‌తో జ్యోతి రాయ్ కిల్లింగ్..కాన్సెప్ట్‌తో పూర్వాజ్ అదుర్స్!
మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో కాన్సెప్ట్‌తో సైంటిఫిక్, ఫిక్షన్‌గా రూపొందుతున్న చిత్రం కిల్లర్. శుక్ర, మాటరాని మౌనమిది సినిమాలతో అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న సుకు పూర్వాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొన్న అందాల భామ జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో దర్శకుడు పూర్వాజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషంగా మారింది.
AU and I, మెర్జ్ ఎక్స్ ఆర్, థింక్ సినిమా బ్యానర్లపై ఈ సినిమాను పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ పద్మనాభరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కన్నడ, తెలుగు భాషల్లో రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ ఎలాంటి అనుభూతిని పంచిందనే వివరాల్లోకి వెళితే..

ప్రాచీన వైమానిక శాస్త్రంలోని అబ్బురపరిచే మానవ మేథస్సుకు సంబంధించిన అంశాలను గ్లింప్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు. మానవ, రొబోటిక్ అంశాలను కలిపి సైంటిఫిక్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందబోతుందనే సంకేతాన్ని ఈ గ్లింప్స్ ద్వారా అందించారు. మైథాలజీని, రోబటిక్ టెక్నాలజీని కలిపి క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించే పనిలో ఉన్నట్టు గ్లింప్స్‌లో స్పష్టం చేశారు. అదే జరిగితే దక్షిణాదిలో ఈ సినిమా సరికొత్త ప్రయోగంగా చెప్పుకోవాల్సిందే.
ఇక సైంటిఫిక్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందినట్టు కనబడుతున్న కిల్లర్‌లో జ్యోతి పూర్వాజ్ కిల్లింగ్ లుక్స్‌తో ఆకట్టుకొన్నారు. అందం, అభినయంతో తన అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు రెడీగా ఉన్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. డీబౌండ్ అనే డిజార్డర్‌తో బాధపడుతున్న ఓ మహిళగా ఓ ఛాలెంజింగ్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సూపర్ షీ పాత్రలో ఆమె ఆహార్యం, బాడీ లాంగ్వేజ్ క్రేజీగా ఉన్నాయి.
హీరోయిన్ పూర్తిగా కోలుకుంటే పునర్జన్మ ఎత్తినట్లే, అప్పుడు ఆమెకు ఎదురు నిలవడం ఎవరి వల్లా కాదు అనే అంశాలు సినిమా కథలో హైలెట్ పాయింట్స్‌గా కనిపించాయి. ఇక గ్లింప్స్ చివర్లో హీరో పూర్వాజ్ మొదలెడుతామా? అంటూ చాలెంజ్ విసరడంతో ఈ సినిమాలో ఏదో విభిన్నమైన పాయింట్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందనే ఫీలింగ్‌ను గ్లింప్స్ ద్వారా కల్పించారు. లవ్, రొమాన్స్, రివేంజ్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త జోనర్ కావడం ఖాయమనే భావనను ఈ గ్లింప్స్ కల్పించింది.
నటీనటులు: జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్, తదితరులు
రచన, దర్శకత్వం: పూర్వాజ్
నిర్మాతలు: పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ పద్మనాభరెడ్డి
సినిమాటోగ్రఫి: జగదీశ్ బొమ్మిశెట్టి
మ్యూజిక్: ఆశీర్వాద్ , సుమన్ జీవ
వీఎఫ్ఎక్స్, వర్చువల్ ప్రొడక్షన్ - మెర్జ్ ఎక్స్ఆర్
లైన్ ప్రొడ్యూసర్: దశరథ
బ్యానర్స్: థింక్ సినిమా, మెర్జ్ ఎక్స్ఆర్, ఏయు అండ్ ఐ


Click it and Unblock the Notifications











