twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జ్యోతిక సినిమా ఎఫెక్ట్.. లైంగిక వేధింపుల నుంచి ధైర్యంగా బయటపడిన చిన్నారి!

    |

    కేవలం వినోద ప్రయోజనాల కోసమే కాకుండా మన సమాజంలో జరిగే వాస్తవ సమస్యలను చర్చించే దిశగా సినిమాలను తెరకెక్కిస్తే ఆ ప్రభావం తప్పకుండా ఏదో ఒక విధంగా నలుగురిలో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చాలా సందర్భాల్లో రుజువైంది. ఇక సౌత్ ఇండస్ట్రీలో కొన్ని పరిశ్రమలు నెమ్మదిగా ఆ దిశగా కదులుతున్నాయి. ఇక ఇటీవల ఒక సినిమా కారణంగా ఒక చిన్నారి లైంగిక వేధింపుల నుంచి బయటపడింది. జ్యోతిక నటించిన 'పొన్మగల్ వంధల్' సినిమా వలనే 9 ఏళ్ల అమ్మాయి తన తల్లిపై లైంగిక వేధింపుల నుంచి దైర్యంగా బయటకు రాగలిగింది.

    సోషల్ మీడియా ద్వారా

    సోషల్ మీడియా ద్వారా

    జ్యోతిక ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో రెగ్యులర్ హీరోయిన్ గా బిజీగా కనిపించిన విషయం తెలిసిందే. హీరో సూర్యను పెళ్లి చేసుకున్న అనంతరం ఆమె ఎక్కువగా ఫ్యామిలీ లైఫ్ తోనే బిజీగా మారారు. కోలీవుడ్ యొక్క ఎవర్‌గ్రీన్ నటి జ్యోతిక చాలా కాలం విరామం తర్వాత కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో కూడా చెక్కుచెదరకుండా ఉంది. అయితే ఆమె ఇన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు కానీ ఇప్పుడే తన డిజిటల్ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇక ఇటీవల తన వలన బయటపడిన ఒక సంఘటన గురించి ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

     జ్యోతిక ఇంట్రెస్టింగ్ మూవీ

    జ్యోతిక ఇంట్రెస్టింగ్ మూవీ

    ప్రస్తుతం జ్యోతిక బలమైన సామాజిక సందేశంతో లేడి ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతున్న ఆమె 2020 చిత్రం 'పొన్మగల్ వంధల్'. రేప్ కేసులను భారతీయ కోర్టుల్లో ఎలా వ్యవహరిస్తారనే అంశంపై తెరకెక్కించినదే. ఆ సినిమాలో చట్టాల్లో ఉన్న కొన్ని లొసుగులను ఆసరాగా చేసుకొని కొందరు నేరస్తులు ఈజీగా బయటపడుతున్నారు. ముఖ్యంగా లైంగిక వేధింపుల నుంచి తప్పించుకుంటున్న వారిపై ఆ సినిమా స్పెషల్ గా ఫోకస్ చేసింది.

    సూర్య నిర్మాతగా

    సూర్య నిర్మాతగా

    అంతే కాకుండా లైంగిక వేధింపుల గురించి కూడా అందరూ ధైర్యంగా బయటకు చెప్పాలని ముఖ్యంగా చిన్న పిల్లలు కూడా ప్రతి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి తీరాలి అనే అంశాలను కూడా బాగా హైలెట్ చేశారు. ఈ చిత్రానికి JJ ఫ్రెడ్రిక్ దర్శకత్వం వహించగా 2D ఎంటర్టైన్మెంట్ లో జ్యోతిక భర్త సూర్య సినిమాను నిర్మించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలును కూడా అందుకుంది.

    ధైర్యంగా బయటకు చెప్పిన చిన్నారి

    ధైర్యంగా బయటకు చెప్పిన చిన్నారి

    'పొన్మగల్ వంధల్' లో ఒక సన్నివేశంలో లైంగిక దాడికి గురైన చిన్నారి తన తల్లితో లైంగిక వేధింపులకు పాల్పడిన బంధువు గురించి ధైర్యంగా మాట్లాడుతుంది. పిల్లలు వారి తల్లిదండ్రుల వద్ద ఏదీ దాచవద్దని అందులో ఒక సీన్ లో బలంగా చెప్పబడుతుంది. ఇక అదే తరహాలో ఇటీవల తమిళనాడులో తొమ్మిదేళ్ల చిన్నారి నిజాన్ని బయటపెట్టిన విధానంపై జ్యోతిక సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

    Recommended Video

    Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ
    జ్యోతిక పవర్ఫుల్ పోస్ట్

    జ్యోతిక పవర్ఫుల్ పోస్ట్

    నిజం చెప్పిన తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరిచారు. ఇక మద్రాస్ హైకోర్టు తీర్పును వెలువరించి అతనికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో జ్యోతిక దీనికి సంబంధించి ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. పోస్ట్‌కి పవర్ఫుల్ సందేశంతో క్యాప్షన్ ఇచ్చింది. ఆ నిశ్శబ్దాన్ని పగలగొట్టండి! ప్రతిసారీ ఒక మహిళ తనకు తానుగా నిలుస్తుంది, తెలియకుండానే ఆమె మహిళలందరికీ అండగా నిలుస్తుంది.. అని వివరణ ఇచ్చారు.

    English summary
    Jyothika amazon prime movie ponmagal vandhal helps a harassment victim open up..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X