వెంకటేష్ హీరోయిన్ జ్యోతిక
సెల్వరాఘవన్ దర్శకత్వంలో వెంకటేష్ నటించనున్న ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సినిమాలో హీరోయిన్‌గా జ్యోతిక ఎంపికైంది. ఈ సినిమా షూటింగ్ జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. చంద్రముఖి సినిమాలో అద్భుత నటనకు నీరాజనాలు అందుకున్న జ్యోతిక ఇటీవల తెలుగులో మాస్ షాక్ చిత్రాల్లో నటించింది. ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సినిమాను ఎన్‌వి ప్రసాద్, సానం నాగ అశోక్ కుమార్ నిర్మిస్తున్నారు. వీరు గతంలో వెంకటేష్‌తో వసంతం సినిమా తీసిన సంగతి తెలిసిందే. తాజా సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ఫిబ్రవరిలోనే లాంఛనంగా ప్రారంభమైనప్పటికీ దర్శకుడు సెల్వరాఘవన్ బిజీగా ఉండడంతో రెగ్యులర్ షూటింగ్ జూన్‌కు వాయిదా పడింది. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న తొలి తెలుగు ్రస్టెయిట్ సినిమా ఇదే.


Click it and Unblock the Notifications