వెంకటేష్- జ్యోతిక కాంబినేషన్
వెంకటేష్ ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సినిమా గురించి గత కొన్ని నెలలుగా వినిపిస్తోంది. టైటిల్‌ను ఖరారు చేసుకున్న తర్వాత ఇంత ఆలస్యం కావడం ఈ సినిమాకు సంబంధించిన ఒక రికార్డు. వెంకటేష్ సరసన జ్యోతిక ఇందులో నటించనున్నట్టు తాజా సమాచారం. సూపర్‌హిట్ చిత్రం చంద్రముఖిలో తన నటనా విశ్వరూపం చూపిన జ్యోతిక తెలుగు షాక్‌లో కూడా బాగా నటించినప్పటికీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. చిరంజీవి పక్కన టాగూర్, నాగార్జున సరసన మాస్ చిత్రాల్లో జ్యోతిక నటించింది. ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే చిత్రానికి 7/జి బృందావన్ కాలనీ ఫేం శ్రీ రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సాయిదేవ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్‌వి ప్రసాద్, సానం నాగ అశోక్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications