నాగార్జున 'గగనం' దర్శకుడి మరో చిత్రం 'మాటరాని మౌనమిది'
దిల్ రాజు నిర్మాణంలో నాగార్జన హీరోగా రూపొందిన "గగనం" చిత్రం దర్శకుడు రాధామోహన్. ఆయన 2007వ సంవత్సంలో తమిళంలో 'మొళి' అనే చిత్రం రూపొందించారు. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం అక్కడ అవార్డులను, రివార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో 'మాటరాని మౌనమిది' పేరుతో అనువదించారు. ప్రకాష్ రాజ్, పృధ్వీరాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. రాధామోహన్ దర్శకుడు. ఎన్. అచ్యుత కాంతారావు నిర్మాత. ఇటీవలే ఈ చిత్రంలోని పాటల్ని విడుదల చేశారు. తొలి సీడీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ "తమిళంలో మాదిరే తెలుగులోనూ ఈ చిత్రం విజయవంతమవుతుంది. జ్యోతిక నటనకి తమిళనాడు ప్రభుత్వ అవార్డు దక్కడం సంతోషంగా ఉంది. విద్యాసాగర్ చక్కటి బాణీలను అందించార"న్నారు "అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా రాధామోహన్ సినిమాను రూపొందించారు. ఆహ్లాదకరంగా సాగుతుంది. ఈ నెల్లోనే విడుదల చేస్తామ"న్నారు నిర్మాత. ఆదిత్య ద్వారా పాటలు విడుదలయ్యాయి.


Click it and Unblock the Notifications











