చంద్రముఖి మళ్లీ వస్తోంది...డిటేల్స్
హైదరాబాద్: తెలుగులో చంద్రముఖి చిత్రంతో తనదైన ముద్రవేసి తర్వాత వివాహం చేసుకుని నటనకు దూరమైన సినీనటి జ్యోతిక. ఆమె ఏడేళ్ల సినీ విరామం తర్వాత 'హౌ ఓల్డ్ ఆర్ యూ' అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు తమిళ సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. మళయాళంలో వచ్చిన 'హౌ ఓల్డ్ ఆర్ యూ' అనే సినిమాను తమిళంలోనూ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాకు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించనున్నారు. మళయాళంలో కూడా ఆయనే దర్శకత్వం వహించడం గమనార్హం. కథానాయిక పాత్ర ప్రధానంగా సాగే ఈ చిత్రంలో మళయాళంలో మంజు నటించింది
కొన్నాళ్ల కిత్రం తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని అలరించింది హీరోయిన్ జ్యోతిక. తమిళ హీరో సూర్యను వివాహం చేసుకున్నాక ఆమె సినిమాలకు పూర్తిగా దూరంగా వుంటోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడావున్నారు. తాజా సమాచారం ప్రకారం జ్యోతిక మరలా సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకుంది. అందుకు ఆమె భర్త సూర్య కూడా అంగీకారం తెలిపారు. అలాగే... తమిళంలో పాండిరాజ్ దర్శకత్వం వహించే ఓ చిత్రంలో జ్యోతిక కీలకమైన అతిథి పాత్రను చేయడానికి అంగీకరించిందని సమాచారం. ఠాగూర్ షాక్ మాస్ చిత్రాలు ఆమెకు తెలుగుపరిశ్రమలో మంచిగుర్తింపునిచ్చాయి.


Click it and Unblock the Notifications











