లం** కొడకా: హీరోయిన్ నోటి నుండి అలాంటి మాటలు...
Recommended Video

ప్రముఖ నటి, హీరో సూర్య సతీమణి జ్యోతిక నటించిన తమిళ చిత్రం 'నాచియార్' తెలుగులో 'ఝాన్సీ' పేరుతో విడుదల కాబోతోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో జ్యోతిక ప్రధాన పాత్ర పోషించగా.... విభిన్నమైన చిత్రాల దర్శకుడు బాలా దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సంబంధించి టీజర్ ఇటీవల విడుదలైంది. ఇందులో జ్యోతిక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ట్రైలర్లో జ్యోతిక లం*** కొడకా అంటూ డైలాగ్స్ చెప్పడం చర్చనీయాంశం అయింది.

కథ ఏమిటి?
టీజర్ చూస్తుంటే ఈ మూవీ మహిళలపై జరుగుతున్న నేరాలు, అత్యాచారాలు లాంటి అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటుందని, ఈ నేరాలను అరికట్టేందుకు ప్రయత్నించే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో జ్యోతిక కనిపించబోతోందని తెలుస్తోంది.

జీవితాంతం జైల్లో ఉంచి చిత్ర హింసలు
నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాడిని జీవితాంతం జైల్లో ఉంచి చిత్రహింస పెట్టాలి అంటూ జ్యోతిక చెప్పే డైలాగులు.... యాసిడ్ దాడి లేక మానభంగానికి గురైన బాధితురాలితో ఆమె చెబుతున్నట్లు తెలుస్తోంది.

రౌడీ పోలీస్ పాత్రలో..
ఇప్పటి వరకు మనం తెరపై హీరోలను మాత్రమే పోలీస్ గెటప్‌లో రౌడీ యాటిట్యూడ్‌తో చూసుంటాం. అయితే తొలిసారిగా జ్యోతిక పోలీస్ పాత్రలో రౌడీ బిహేవియర్‌తో రాష్‌గా ప్రవర్తించే కఠినమైన లేడీగా చూడబోతున్నాం.

లం* కొడకా
నరికిపారేస్తా నీ యబ్బ లం** కొడకల్లారా అంటూ జ్యోతిక చెప్పే డైలాగులు ఆమె పాత్ర ఈ సినిమాలో ఎంత పవర్‌ఫుల్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జ్యోతిక తన కెరీర్లో చేసిన అత్యంత టఫ్ క్యారెక్టర్ ఇదేనంట.


Click it and Unblock the Notifications











