Just In
- 50 min ago
దానికి రెడీ అంటూ అలీకి షాకిచ్చిన షకీలా: తెలుగు డైరెక్టర్ ఫోన్.. మోసం చేసింది ఆయనంటూ లీక్ చేసింది
- 1 hr ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
- 1 hr ago
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- 2 hrs ago
మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
Don't Miss!
- Sports
ఆస్ట్రేలియాని వెనక్కి నెట్టిన టీమిండియా.. నెం.1లో న్యూజిలాండ్!
- News
Paul Dhinakaran జీసస్ కాల్స్ సంస్థలపై ఐటీ దాడులు .. ఎన్నికలకు ముందే..!
- Finance
41 కోట్ల జన్ ధన్ ఖాతాలు, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ 7.5%
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాలచందర్ ఆరోగ్య పరిస్ధితి ఏంటి? (ఫొటో)
చెన్నై : అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన సినీ దర్శకదిగ్గజం కె.బాలచందర్ క్రమేణా కోలుకుంటున్నారు. వివిధ అనారోగ్య సమస్యల కారణంగా రెండు రోజుల క్రితం బాలచందర్ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన అనారోగ్యం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. అయితే ఆయన క్రమేణా కోలుకుంటున్నారని ఆసుపత్రివర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు ఐసియు వార్డులో ఆయన ఫొటో ని విడుదల చేసారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తీవ్ర అనారోగ్యానికి గురైన బాలచందర్ చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలచందర్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో బాలచందర్ తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. కమలహాసన్, రజినీకాంత్, మమ్ముట్టీ, చిరంజీవి(తమిళ సినిమాకు)లను సినిమా పరిశ్రమకు పరిచయం చేసింది బాలచందరే.
మరో ప్రక్క ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ.... బాలచందర్‌పై వచ్చిన పుకార్లను వర్మ నమ్ముతూ..స్వర్గస్థులైన బాలచందర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ట్వీట్ చేశారు. ఇండియన్ సినిమాలో విలక్షణ దర్శకుడని కొనియాడారు .
ఆ తర్వాత బాలచందర్ గురించి అసలు విషయం తెలుసుకున్న వర్మ మళ్లీ ట్వీట్టర్‌లో స్పందిస్తూ ‘‘చెక్ చేసుకోకుండా ప్రచారం అయిన వదంతులను నమ్మి బాలచందర్‌గారి గురించి ట్వీట్ చేయడంపై సారీ చెబుతున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.'' అని పోస్ట్ చేశారు. అయితే ఆయనపై ఇలాంటి పుకార్లు రాకుండా కావేరి హాస్పటల్ వైద్యులు హెల్త్ బులెటిన్స్ విడుదల చేస్తున్నారు.