మల్లికా షెరావత్ హాట్ పోస్టర్ వివాదం, దర్శకుడు మరోలా!
హైదరాబాద్: మల్లికా షెరావత్ నటిస్తున్న 'డర్టీ పాలిటిక్స్' సినిమాకు సంబంధించిన పోస్టర్ ఇటీవల విడుదలై వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. జాతీయ జెండాను పోలిన మూడు రంగుల జెండా కప్పుకుని ఉన్న మల్లిక షెరావత్ పోస్టర్‌పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పోస్టర్ జాతీయ జెండాను అవమానించే విధంగా ఉందని కొందరు కేసు కూడా వేసారు. అయితే దర్శకుడు కె.సి. బోకాడియా వాదన మాత్రం మరోలా ఉంది. జాతీయ జెండాలా కనిపించటం మాట వాస్తవమే అయినప్పటికీ.. ఈ జెండాపై అశోక చక్రం లేదు. జాతీయ జెండా అనటానికి వీల్లేదు అంటూ దర్శకుడు తన వాదన వినిపిస్తున్నాడు.

ఇక సినిమా విషయానికొస్తే.... రాజస్థాన్లోని జోధ్‌పూర్‌లో సంచలనం సృష్టించిన నర్సు భన్వరీదేవి సెక్స్ స్కాండల్ ఆధారితం ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. భన్వరీ దేవి పాత్రలో మల్లిక షెరావత్ నటిస్తోంది. భన్వరీ దేవి కథ వివాదాల పుట్ట. అంతుచిక్కని మిస్టరీ. రాజస్థాన్‌కు చెందిన పలువురు మంత్రులతో ఆమెకు ఎఫైర్లు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తనతో సంబంధం పెట్టుకున్న మంత్రులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడం అప్పట్లో చర్చనీయంశం అయింది.
ఆ తర్వాత ఆమెకు హత్యకు గురైంది. ఆమె హత్య వెనక పలువురు మంత్రుల హస్తం ఉన్నట్లు అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఈ వివాదాలను తాజాగా 'డర్టీ పాలిటిక్స్' సినిమాలో చూపించబనున్నట్లు తెలుస్తోంది. మల్లికా షెరావత్ హాట్ అందాలు, ఆసక్తిని రేపే వివాదాలతో కూడిన ఈ సినిమాకు మంచి స్పందన వస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











