twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KCR BirthDay: బండ్ల గణేష్ కామెంట్స్.. అనసూయ ఎలా రియాక్ట్ అయిందంటే!

    |

    నేడు (ఫిబ్రవరి 17) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఈ రోజుతో 65 సంవత్సరాలు పూర్తిచేసుకొని 66వ సంవత్సరం లోకి అడుగెడుతున్నారు కేసీఆర్. ఈ సందర్బంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా సినీ నటులు బండ్ల గణేష్, అనసూయ రియాక్ట్ అవుతూ సోషల్ మీడియాలో సందేశం పోస్ట్ చేశారు. వివరాల్లోకి పోతే..

    నరేంద్ర మోదీ మొదలుకొని అశేష ప్రజానీకం..

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదలుకొని రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు కేసీఆర్‌కి విషెస్ తెలుపుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, అశేష ప్రజానీకం కేసీఆర్‌కి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

    వైఎస్ జగన్ ట్వీట్..

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేస్తూ.. ''తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా'' అని పేర్కొన్నారు.

    చంద్రబాబు నాయుడి సందేశం

    ''కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను'' అంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

    ఆకాశానికెత్తిన బండ్ల గణేష్

    ఇకపోతే సినీ నటుడు, రాజకీయ వేత్త బండ్ల గణేష్ కేసీఆర్‌ని ఆకాశానికెత్తుతూ విష్ చేశారు. ''దైవానుగ్రహంతో పుట్టిన మహోన్నత వ్యక్తి, తెలంగాణ జాతిపిత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు'' అంటూ ⁦కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు బండ్ల గణేష్.

    అనసూయ భరద్వాజ్ రెస్పాన్స్

    ఇకపోతే జబర్ధస్త్ షోతో పాపులర్ అయిన అనసూయ భరద్వాజ్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. తెలంగాణ ఐటీ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన ఆమె.. ''హ్యాపీ బర్త్ సీఎం సర్.. హ్యాపీ బర్త్ డే కేసీఆర్ సర్'' అని పేర్కొంది..

    Recommended Video

    Hero Srikanth Father Passed Away | Filmibeat Telugu
    తెలంగాణ ఉద్యమం.. రెండు దఫాలు ముఖ్యమంత్రిగా

    తెలంగాణ ఉద్యమం.. రెండు దఫాలు ముఖ్యమంత్రిగా

    తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసి.. ప్రత్యేక తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించారు కేసీఆర్. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆయన.. రెండోసారి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి పాలన కొనసాగిస్తున్నారు.

    English summary
    Today (February 17) Telangan Cm K. Chandrashekar Rao Birth day. On this occasion so many pilitical and cine celebrities posted their wishes in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X