twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ నిర్మల భౌతిక కాయానికి నివాళులు.. కృష్ణను ఓదార్చిన కేసీఆర్

    |

    Recommended Video

    Telangana CM KCR, Megastar Chiranjeevi Condolences To Vijaya Nirmala Family || Filmibeat Telugu

    గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ నిర్మల గురువారం తెల్లవారు జామున హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈమె మృతి యావత్ సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. సినీ, రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. విజయనిర్మల మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె కుటుంబానికి తమ తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప రాష్ట్రపతి వెనకయ్యనాయుడు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, చిరంజీవి తదితరులు విజయ నిర్మల మరణం పట్ల తమ విచారాన్ని వ్యక్తం చేశారు. కాగా నిన్న సాయంత్రం నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌.. విజయ నిర్మల భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. భార్య విజయనిర్మల మరణంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయిన సూపర్ స్టార్ కృష్ణను కేసీఆర్ దగ్గరకు తీసుకొని ఓదార్చారు. దాదాపు 20 నిమిషాల పాటు అక్కడే గడిపిన కేసీఆర్.. నరేష్, విజయనిర్మల ఇతర కుటుంబీకులను ఓదార్చారు.

    K. Chandrashekar Rao condolence On Vijaya Nirmala Death

    కేసీఆర్‌తో పాటుగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీలు కేకే, సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి కూడా విజయ నిర్మల భౌతిక కాయానికి నివాళులు అర్పించి తమ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం విజయనిర్మల భౌతిక కాయాన్ని ఆమె నివాసంలో ఉంచారు. ఈ రోజు (శుక్రవారం) ఉదయం క్రవారం ఉదయం ఫిలింఛాంబర్‌కు తరలించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తారు. శుక్రవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం విజయ నిర్మల అంత్యక్రియలు చిలుకూరు లోని ఆమె ఫామ్ హౌస్‌లో జరగనున్నాయి.

    English summary
    Super Star krishna wife Vijaya Nirmala death on wednesday midnight. On her Death so many industry people and politicians responds and giving their condolence.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X