K.G.F: Chapter 2: ఆ ఘనత సాధించిన తొలి సినిమాగా రికార్డు.. తగ్గేదేలే అంటున్న యష్

రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన కేజిఎఫ్ సినిమా తెలుగులోనే కాదు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా విడుదలైన కేజేఎఫ్ 2 కూడా ఈ మధ్యనే రికార్డులు బద్దలు కొడుతూ వెళుతున్న నేపథ్యంలో ఇప్పుడు డిజిటల్ వేదికగా విడుదలయింది. ఇక తాజాగా ఈ సినిమా కూడా ఒక రికార్డు బద్దలు కొట్టినట్లు సమాచారం. ఈ సినిమా ఏ రికార్డు బద్దలు కొట్టిందనే విషయానికి వెళ్తే

రికార్డులు బద్దలు

రికార్డులు బద్దలు


ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన చిత్రం కేజిఎఫ్. 2018 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చేస్తామని అప్పట్లోనే ప్రకటించారు మేకర్స్. దానికి అనుగుణంగానే ఈ సినిమా రెండో భాగాన్ని ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సినిమా విడుదలైన నాటి నుంచి అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతుంది.

తొలి సినిమాగా

తొలి సినిమాగా


ఇప్పటికే 1200 కోట్లకు రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. అయితే తాజాగా ఈ సినిమా మరో రికార్డు బద్దలు కొట్టింది. రేటింగ్స్ అలాగే సోషల్ మీడియా ప్రకారం పోల్స్ నిర్వహిస్తూ ఉండే ఆర్మాక్స్ సంస్థకు సంబంధించిన ఒక విషయంలో ఈ సినిమా రికార్డు బద్దలు కొట్టినట్లు సమాచారం అందుతుంది. ఓర్మాక్స్ సంస్థ ఇచ్చే పవర్ రేటింగ్స్ లో 90+ స్కోరు సాధించిన తొలి సినిమాగా ఇప్పుడు 'కేజీయఫ్‌2' వరల్డ్‌ రికార్డు సృష్టించింది.

 ఓర్‌మ్యాక్స్‌ పవర్‌ రేటింగ్స్‌

ఓర్‌మ్యాక్స్‌ పవర్‌ రేటింగ్స్‌


తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో కలిపి ఓర్‌మ్యాక్స్‌ పవర్‌ రేటింగ్స్‌లో కేజేఎఫ్ 2 సినిమా ఈ ఘనత సాధించింది. ఐఎండిబి రేటింగ్స్ లో కూడా 8.5 రేటింగ్ తో కేజీఎఫ్ 2 అదర కొట్టింది. ఇక ఈ సినిమా సుమారు 1200 కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టగా అందులో కేవలం హిందీ వర్షన్ నుంచే సుమారు 430 కోట్ల రూపాయలకు పైగా రాబట్టినట్లు సమాచారం.

 సలార్ పేరుతో

సలార్ పేరుతో


ఈ సినిమాకి సీక్వెల్ ఉండే అవకాశం ఉందని ప్రశాంత్ నీల్ సినిమా చివరిలో హింట్ ఇవ్వడంతో ఈ సీక్వెల్ సినిమా ఎప్పుడు ఉండవచ్చు అనే విషయం మీద కూడా చర్చ జరుగుతుంది. ఇక ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు. సలార్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

 అతిథి పాత్రలో

అతిథి పాత్రలో


ఇక ఈ 'సలార్‌' సినిమాలో యష్ అతిథి పాత్రలో మెరుస్తారని ప్రచారం అయితే జరుగుతోంది. కానీ అది నిజం అయ్యే అవకాశమే లేదని మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయనేది చూడాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: kgf kgf 2 yash kannada
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X