నేను అంత కుసంస్కారిని కాదు: రాఘవేంద్రరావు
తెలంగాణలో ఎన్నికల వేళ మీడియాలో తనపై వచ్చిన వార్తలపై ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఓటు వేసేందుకు వచ్చిన దర్శకేంద్రుడు అవమానానికి గురైనట్లు మీడియాలో కథనాలు రావడమే ఇందుకు కారణం.
ఫిలింనగర్ పోలింగ్ బూత్ లో ఓటు వేసేందుకు రాఘవేంద్రరావు వచ్చిన సమయంలో క్యూలైన్ పెద్దగా ఉండటంతో ఆయన క్యూ పాటించకుండా నేరుగా బూత్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారని, దీంతో క్యూలో నిల్చున్న ఓటర్లు ఆయన్ను అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తల్లో నిజం లేదని, తనను ఎవరూ అడ్డుకోలేదని, నాకు వేరే అర్జెంట్ పని ఉండటంతో వెళ్లిపోయాను. నేను బాధ్యత కలిగిన వ్యక్తిని. ఇతరుల మీద అలిగి ఓటు వేయకుండా వెళ్లిపోయేంత కుసంస్కారిని కాదు, ఇలాంటి వార్తలు వేసే ముందు తనను సంప్రదించాల్సిన బాధ్యత మీడియాపై ఉందని రాఘవేంద్రరావు పేర్కొన్నారు.
మరో వైపు రాఘవేంద్రరావు ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెనుదిరిగారు అనే వార్తలు సైతం యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదని తేలిపోయింది. ఆయన ఓటు హక్కు వినియోగించుకుని సిరా మరక పడ్డ తన వేలును మీడియాకు చూపించారు.


Click it and Unblock the Notifications











