"నటన అనేది మనిషి అయితే దాని ప్రాణం మా జూ తారక రాముడు"

జై లవ కువ మూవీని రాఘవేంద్రరావు ప్రశంసించారు. ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందిన మెచ్చుకున్నారు.

By Bojja Kumar

Recommended Video

Jai Lava Kusa NTR got Huge Praises నటన అనేది మనిషి అయితే దానికి ప్రాణం NTR

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్‌కు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నుండి అద్భుతమైన కాంప్లిమెంట్ ఇచ్చారు. 'జై లవ కుశ' సినిమా చూసిన అనంతరం ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ తారక్ మీద ప్రశంసల వర్షం కురిపించారు.

ట్విట్టర్లో రాఘవేంద్రరావు స్పందిస్తూ..... 'నటన అనేది మనిషి అయితే దానికి ప్రాణం మా జూనియర్ తారక రాముడు. జై లవ కుశ లో అమోఘం. జై ఒక అద్భుతం. ఇంకెన్నో శిఖరాలని అందుకోవాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు.

K Raghavendra Rao praises NTR For Jai Lava Kusa Movie

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా , సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో రూపొందిన చిత్రం 'జై లవ కుశ' . యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

"యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం తో పాటు, అన్నదమ్ముల మధ్య నడిచే ఒక బలమైన కథ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మించిన ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద మంచి స్పందన వస్తోంది.

కే. ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాశీ ఖన్నా , నివేత థామస్ ఈ చిత్రం లో కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ సమకూర్చారు. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, తమ్మి రాజు. విసువల్ ఎఫెక్ట్స్ : అనిల్ పాదూరి (అద్విత క్రియేటివ్ స్టూడియోస్).

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X