twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నమయ్య జ్ఞాపకాల్లో దర్శకేంద్రుడు.. వారి శ్రమ మరిచిపోనంటూ ట్వీట్స్

    |

    దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అద్భుత ఊహాలోకంలోంచి పుట్టుకొచ్చిన అపురూప చిత్రం అన్నమయ్య. మాస్ బీట్స్, రొమాంటిక్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ చిత్రాలు రాజ్యమేలుతున్న సమయంలో.. భక్తిరస చిత్రంతో అందర్నీ మెప్పించాడు. తెలుగు సినీ చరిత్రలో అన్నమయ్యది ఓ సువర్ణాధ్యాయం. ప్రతీ సీన్, ప్రతీ పాట ఓ మధుర కావ్యంగా ఉంటుంది. అందులోనూ అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలను జోడించి అందరి చేత చప్పట్లు కొట్టించారు.

    అన్నమయ్య 1997 మే 22న విడుదలైంది. నేడు నాటి జ్ఞాపకాల్లో మునిగిపోయాడు దర్శకేంద్రుడు. అప్పటి స్థితిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు ఆయన ప్రతీ ఒక్కరినీ పేరు పేరున ప్రస్తావిస్తూ అందరి శ్రమను ప్రశంసించాడు. ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ ఏంటో ఓసారి చూద్దాం.

    K Raghavendra Rao Recalls Annamayya Shoot Days

    నా పుట్టినరోజుకు ఒక్కరోజు ముందు.. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో గుర్తు చేసుకుంటున్నాను..ఓ ప్రత్యేకమైన చిత్రం ( అన్నమయ్య) విడుదలైంది. నా జీవితాంతం సంతోషపడే చిత్రం.. అలాంటి సినిమాను చేసే అవకాశాన్ని ఇచ్చిన ఆ దైవానికి కృతజ్ఞతలు. ఈ చిత్రం కోసం పాటు పడిన నాగార్జున, మోహన్ బాబు, సుమన్, రమ్యకృష్ణ, కస్తూరి, కీరవాణి, భారవి, దొరసామి రాజు వారి శ్రమను నేనెప్పటికి మరిచిపోలేను. వారే కాకుండా మరపురాని ఈ చిత్ర ప్రయాణంలో బాగమైన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు' అని ఎమోషనల్ అయ్యారు.

    English summary
    K Raghavendra Rao Recalls Annamayya Shoot Days. I can't forget the efforts of nagarjuna mohanbabu, ramyakrishnan, KasthuriShankar, mmkeeravaani, Bharavi, Producer Doraswami Raju garu and everyone else who was a part of the film and thank them for being a part of the unforgettable journey! #Annamayya
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X