‘మహానటి’పై దర్శకేంద్రుడి రివ్యూ... 28 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?

By Bojja Kumar

Recommended Video

Mahanati Gets Compliments From Raghavendra Rao

సావిత్రి జీవితంపై తెరకెక్కిన 'మహానటి' మూవీ గ్రాండ్‌గా విడుదలైంది. సినీ ప్రముఖులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. 'మహానటి' చూసిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రావు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇలాంటి గొప్ప సినిమా తీసిన వైజయంతి మూవీస్ వారికి ధన్యవాదాలు తెలిపారు. సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ జీవించిందని ప్రశంసలు గుప్పించారు. దీంతో పాటు 28 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు.

సావిత్రి చరిత్ర తరతరాలకు అందించారు

సావిత్రి చరిత్ర తరతరాలకు అందించారు

"సావిత్రి గారి చరిత్ర తరతరాలకు అందించిన స్వప్న సినిమా వైజయంతి మూవీస్ కి ధన్యవాదాలు . సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించింది. శివాజీ గణేశన్ గా దుల్కర్ సల్మాన్ నటన అద్భుతం. నాగ అశ్విన్ మరియు చిత్ర యూనిట్ కి నా అభినందనలు.... అని రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు.

28 ఏళ్ళ క్రితం ఇదే రోజున భారీ వర్షం

28 ఏళ్ళ క్రితం ఇదే రోజున భారీ వర్షం

28 ఏళ్ళ క్రితం ఇదే రోజున భారీ వర్షం. అపుడు ‘జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా విడుదలైంది. చాలా పెద్ద సినిమా తీసాము అనే ఆనందం, ఎలా ఆడుతుందో అనే భయం. ఎప్పుడు వరద ఆగుతుందో అనే ఎదురుచూపు... ఎట్టకేలకు సాయంత్రం నుంచి సినిమా హాళ్ల వైపు జనాలు కదిలారు... మరుసటి రోజు నుంచి వరద థియేటర్లలో అభిమానుల రూపంలో రావడం మొదలైందని రాఘవేంద్రరావు గుర్తు చేసుకున్నారు.

మహానటి నిర్మించడానికి అంతే ధైర్యం కావాలి

మహానటి నిర్మించడానికి అంతే ధైర్యం కావాలి

మా దత్తు గారికి ఆరోజు ఎంత ఆనందం వేసిందో ఇప్పటికి మర్చిపోలేదు. సరిగ్గా 28 ఏళ్ల తర్వాత ఇదే రోజున ‘మహానటి' విడుదలయింది. ఆరోజున జగదేక వీరుడు అతిలోకసుందరి నిర్మించడానికి ఎంత ధైర్యం కావాలో నేడు మహానటి నిర్మించడానికి అంతే ధైర్యం కావాలి.... అని రాఘవేంద్రరావు గుర్తు చేసుకున్నారు.

మహానటి

మహానటి

‘మహానటి' చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. కీర్తీ సురేష్ టైటిల్ పాత్రలో నటించగా, దుల్కర్ సల్మాన్ సావిత్రి భర్త జెమినీ గణేశన్‌ పాత్రను పోషించారు. సావిత్రి చిన్నతనం నుండి మహానటిగా ఆమె ఎలా ఎదిగారు అనే విషయాలన్నీ ఈ సినిమాలో చూపించారు. స్టార్ హీరోయిన్ సమంత ఈ మూవీలో జర్నలిస్టు మధురవాణి పాత్ర పోషించారు. ఆమెతో పాటు ఉండే ప్రెస్ ఫోటోగ్రాఫర్ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. వీరితో పాటు రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్, భానుప్రియ, శాలిని పాండే, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న "మహానటి" చిత్రాన్ని దర్శకుడు నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్: అవినాష్, కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, కెమెరా: డాని, కళా నేతృత్వం: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, దర్శకత్వం: నాగ అశ్విన్, నిర్మాత: ప్రియాంక దత్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X