twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    50 మంది చిన్నారులతో కె.రాఘవేంద్రరావు

    By Srikanya
    |

    వైజాగ్ : భారతీయ సంస్కృతి, గొప్పతనాన్ని తెలియజేసే కథాంశంతో దర్శకేంద్రుడు రూపొందిస్తున్న 'ఇంటింటా అన్నమయ్య' చిత్రంలో గాజువాకకు చెందిన 50 మంది చిన్నారులకు నటించే అవకాశం లభించింది. ఈ మేరకు చిత్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావు గాజువాకలోని నిర్మల మ్యూజిక్‌ అండ్‌ డాన్స్‌ అకాడమీని సందర్శించారు. చిన్నారులతో కీర్తనలు పాడించి, నృత్యాలు చేయించారు. సాయిబాబా మూవీస్‌ పతాకంపై విజయదశమి రోజున చిత్ర నిర్మాణం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

    నవంబరు 1 నుంచి 20 వరకు అరుకులోయలో తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతుంది. అకాడమీకి చెందిన 25 మంది చిన్నారి నృత్య కళాకారిణులు, మరో 20 మంది బాలగాయకులు పాల్గొంటారు. ఇందుకోసం 6 నుంచి 11 ఏళ్లలోపుచిన్నారులను ఎంపిక చేశారు. నాలుగురోజులపాటు షూటింగ్‌ జరుగుతుంది. చిత్ర నిర్మాత యలమంచిలి సాయిబాబా, కథానాయకుడు రేవంత్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్వర్ణగౌరి, అకాడమీ వ్యవస్థాపకుడు సంగాపు వెంకటరావు, డైరెక్టర్‌ తిలగవతి తదితరులు పాల్గొన్నారు.

    'శ్రీరామరాజ్యం' చిత్రంతో తన బేనరు ప్రతిష్టను పెంచుకున్న సాయిబాబా మూవీస్ అధినేత యలమంచిలి సాయిబాబా నిర్మిస్తున్న తాజా చిత్రం 'ఇంటింటా అన్నమయ్య'. సీనియర్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకునే ఈ చిత్రంలో సాయిబాబా తనయుడు రేవంత్ హీరోగా పరిచయమవుతున్నారు. అనన్య, సనంశెట్టి కథానాయికలు. ఈ చిత్రం షూటింగ్ విజయదశమి సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

    నిర్మాత యలమంచిలి సాయిబాబా మాట్లాడుతూ 'భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని తెలిపే అద్భుతమైన కథ ఇది. ఓ కొత్త పంథాలో రూపొందే ఈ సినిమాలో యువతరం మెచ్చే ప్రేమకథ కూడా ఉంటుంది. అన్నమయ్య కీర్తనల నేపథ్యంలో సంగీత ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కొన్ని కీర్తనలు హిందూస్థానీ కలయికలో ఉంటాయి.

    ఐదు పాటల రికార్డింగ్ పూర్తయింది. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. నవంబర్ ఒకటి నుంచి ఇరవై వరకూ అరకు లోయలో తొలి షెడ్యూల్ జరుగుతుంది. రెండో షెడ్యూల్ డిసెంబర్ ఒకటి నుంచి హైదరాబాద్‌లో ఉంటుంది' అని తెలిపారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, జయప్రకాశ్‌రెడ్డి, సుధ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: ఎస్.గోపాలరెడ్డి, సంగీతం: కీరవాణి, నిర్మాత: యలమంచిలి సాయిబాబా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు.

    English summary
    Sri Rama Rajyam movie producer Yalamanchali Saibabu's son, Revanth is all set to make her debut as hero in veteran director K Raghavendra Rao's new musical movie titled Intintaa Annamayya. This will be produced by Sai Babu himself. Intintaa Annamayya has two heroines and Ananya of Journey fame has been finalized for one role. M M Keeravani is providing the music. The movie is not a mythological movie, It is all about a youth who uses Annamayya songs in modern context.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X