twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్ళాం ఊరెళితేకి కాపీ.. తమన్నా, మెహ్రీన్ బికినిలో.. రాఘవేంద్ర రావు హాట్ కామెంట్స్!

    |

    విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలసి నటించిన మల్టీస్టారర్ ఎఫ్2 ఇప్పటికీ బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. దాదాపు 80 కోట్ల షేర్ సాధించింది. వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ గ్రాసర్ గా ఎఫ్2 నిలిచింది.చాలా కాలం తర్వాత వెంకటేష్ కామిక్ రోల్ లో చెలరేగిపోయి నటించాడు. వెంకీ, వరుణ్ తోడల్లుళ్లుగా చేసిన రచ్చని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. అర్థ శతదినోత్సవ వేడుకని చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించారు. రాఘవేంద్ర రావు, ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి సీనియర్ దర్శకులు ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు.

     చాలా ఏళ్ళు అవుతోంది

    చాలా ఏళ్ళు అవుతోంది

    దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించిన చిత్రం ఎఫ్2 అని అన్నారు. బయ్యర్లకు ఈ స్థాయిలో లాభాలు రావడం చూసి చాలా ఏళ్ళు అవుతోందని రాఘవేంద్ర రావు అన్నారు. ఎంత మంచి చిత్రానికి అయినా మంచి నిర్మాత అవసరం. ఎఫ్2 చిత్రానికి దిల్ రాజు నిర్మాత. నిర్మాతగా ఆయన ప్లానింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.స్వతహాగా దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ కూడా కాబట్టి పంపిణీ విషయంలో దిల్ రాజు పక్కాగా ఉంటారని రాఘవేంద్ర రావు అన్నారు.

     ఆరోగ్యం కోసం

    ఆరోగ్యం కోసం

    మనమంతా ఆరోగ్యం కోసం జిమ్ కి వెళతాం. కానీ అనిల్ రావిపూడి సినిమాలు చూస్తే జిమ్ కు వెళ్లనవసరం లేదని, నవ్వులతోనే ఆరోగ్యం పెరుగుతుందని రాఘవేంద్ర రావు ప్రశంసించారు. తాను అనిల్ రావిపూడి చిత్రాలన్నీ రెండు మూడు సార్లు చూస్తుంటానని రాఘవేంద్ర రావు అన్నారు. ఈ చిత్రంలో నా ఫెవరెట్ డైలాగ్.. 'ఉన్నదంతా అమ్మాయిలకే కదా' అని రాఘవేంద్ర రావు అన్నారు. అలాగే ఈ సంక్రాంతికి ఎఫ్2 ఒక్కటే హిట్ సినిమా. కాబట్టి ఉన్న వసూళ్లన్నీ వాళ్ళకే అని అన్నారు.

     చిన్న సినిమా

    చిన్న సినిమా

    ఎఫ్2 చిత్రం చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది అన్నారు. తాను డైరెక్ట్ చేసిన పెళ్లి సందడి చిత్రం కూడా చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టింది. కాబట్టి చిన్న సినిమాలని కూడా ఎంకరేజ్ చేయాలని రాఘవేంద్ర రావు అన్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర రావు ఎఫ్2 చిత్ర యూనిట్ మొత్తాన్ని అభినందించారు.

     తమన్నా, మెహ్రీన్ బికినిలో

    తమన్నా, మెహ్రీన్ బికినిలో

    ఎఫ్2 చిత్రానికి రిపీట్ ఆడియన్స్ పెరగడానికి మరో కారణం కూడా ఉందని రాఘవేంద్ర రావు అన్నారు. హీరోయిన్లు తమన్నా, మెహ్రీన్ ని అనిల్ రావిపూడి చాలా గ్లామరస్ గా చూపించాడు. ఇక వాళ్లిద్దరూ బికినిలో చాలా అద్భుతంగా ఉన్నారంటూ సరదాగా వ్యాఖ్యానించారు. హీరోయిన్లని ఎక్కువగా కన్నీళ్లు, ఏడుపులతో చూపించకుండా గ్లామరస్ గా చూపించాలి అని రాఘవేంద్ర రావు వ్యాఖ్యానించారు.

    పెళ్ళాం ఊరెళితే

    పెళ్ళాం ఊరెళితే

    మరో దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టాలెంట్ ని వెతికి పట్టుకోవడంలో దిల్ రాజు దిట్ట అని అన్నారు. అందుకే ఆయనకు వరుసగా విజయాలు దక్కుతున్నాయి. తాను, దర్శకుడు అనిల్ రావిపూడి ఓ కార్యక్రమంలో కలుసుకున్నాం. మీరు తెరకెక్కించిన పెళ్ళాం ఊరెళితే చిత్రానికి ఇన్స్ పైర్ అయి ఓ చిత్రాన్ని చేస్తున్నట్లు తెలిపాడు. అప్పుడే ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకున్నా అని ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు.

     లాజిక్ అవసరం లేదు

    లాజిక్ అవసరం లేదు

    నీ చిత్రానికి ఇన్స్ పైర్ అయి ఓ సినిమా చేస్తున్నట్లు ధైర్యంగా చెప్పే దర్శకులు చాలా తక్కువ అని, ఆ ధైర్యం అనిల్ రావిపూడి చేశారని ప్రశంసించారు. తాను కోరుకున్న విధంగా ఈ చిత్రం ఘనవిజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. తాను సినిమాలు తీసే సమయంలో ఒకటే ప్రశ్న వేసుకున్నా.. ఈ చిత్రం నవ్విస్తుందా లేదా.. ఈ డైలాగ్ నవ్విస్తుందా లేదా.. నవ్విస్తే సినిమా హిట్ గ్యారెంటీ. ఇక అందులో ఆడియన్స్ లాజిక్కులు ఆలోచించారు. నవ్వు అనే జిమ్మిక్కుని మాత్రమే ఆస్వాదిస్తారు అని ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు.

    English summary
    K Raghavendra Rao Speech at F2 Movie 50 Days Celebrations
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X