రాజమౌళి త్వరలో తన గురువు కె.రాఘవేంద్రరావు నిర్మించబోయే చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నాడు. ఆయన తన ఆర్కే బ్యానర్ పై ఈ నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. అసలు మొదట ప్రభాస్ హీరోగా రాఘవేంద్రరావు పరుశరాముడు చిత్రం తెరకెక్కించటానికి సన్నాహాలు చేసారు. అయితే మారిన సమీకరణాలు దృష్ట్యా ఆయన ప్రస్తుతం మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ కుమార్ ప్రాజెక్టుని డైరక్ట్ చేయటానికి కమిట్ అయ్యారు. ఓ మ్యూజికల్ రొమాంటిక్ చిత్రంగా దాన్ని తీర్చి దిద్దాలని పట్టుదలతో ఉన్నారు. అందుకోసం కీరవాణి సంగీతంలో పాటలు సిద్దం చేసే పనిలో ఉన్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో ఏక్ నిరంజన్ చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో డార్లింగ్, దశరధ్ కాంబినేషన్లో మరో చిత్రం చేయనున్నారు.