twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అభిలాష’ బడ్జెట్ తెలిస్తే అందరూ నన్ను కొడతారు... ఆ లాభాలతోనే ఇళ్లు కట్టానన్న నిర్మాత

    |

    తెలుగు సినీ చరిత్రలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్, నిర్మాత కేఎస్ రామారావుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. విభిన్న రకాలు చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన దిట్టా. ఓ అభిలాష తీయాలన్నా, చంటి సినిమా తీయాలన్నా, క్రిమినల్ లాంటి కొత్త తరహా చిత్రాలను తెరకెక్కించాలన్నా, మాతృదేవో భవ వంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలన్న అది కేఎస్ రామారావు వంటి వారి వల్లనే సాధ్యమవుతుంది. తాజాగా కేఎస్ రామారావు అలీ నిర్వహించే షోలో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించారు.

     టెక్నీషియన్ అవుదామని..

    టెక్నీషియన్ అవుదామని..

    క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కేఎస్ రామారావు తన సినీ జీవితం గురించి చెబుతూ.. ‘మద్రాసుకు వచ్చినప్పుడు తనకు హీరో, నిర్మాత, దర్శకుడు అవుదామని ఎలాంటి కోరికలు లేవు. ఓ మంచి టెక్నీషియన్ అవుదామని అనుకున్నా. అందుకే రాఘవేంద్రరావు తండ్రి కేఎస్ ప్రకాశ్ దగ్గర చివరి అసిస్టెంట్‌గా చేరాను. మూడు సినిమాలకు అసిస్టెంట్‌గా పని చేశాను.

     రేడియో రామారావు..

    రేడియో రామారావు..

    ఆపై కొన్ని సమస్యలతో మళ్లీ స్వగ్రామానికి వెళ్లాను. కొంతకాలం తరువాత మళ్లీ వచ్చాను. అయితే నన్ను ఎక్కువగా రేడియో రామారావుగానే గుర్తుంచుకునేవారు. రేడియో పబ్లిసిటీ, ఆపై దూరదర్శన్ వచ్చాక అందులోనూ పబ్లిసిటీ పనులను చూసుకునేవాడిని. పుస్తకాలు, కథలు వినడం చాలా ఇష్టం.

    ఆ కన్నడ దర్శకుడి వల్లే..

    ఆ కన్నడ దర్శకుడి వల్లే..


    కన్నడ పుట్టన్న చిత్రాలు, ఆయన శైలి అంటే ఇష్టం, ఆయన తెరకెక్కించే చిత్రాలు చాలా బాగుంటాయి. ఆయన వల్లే చిత్రాలను నిర్మించాలనే ఆలోచన వచ్చింది. ఆయన కన్నడలో తెరకెక్కించే చిత్రాలను తెలుగులో డబ్ చేసే వాడిని. ఆ క్రమంలో ఎర్ర గులాబీలు చిత్రం కూడా డబ్ చేశాను. చాలా మంచి పేరు వచ్చింది.

     సొంతంగా చిత్రం..

    సొంతంగా చిత్రం..

    ఇక ఇలా డబ్బింగ్ కాకుండా సొంతంగా చిత్రం చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పటికే యండమూరి చాలా ఫేమస్ ఆయన నవలలు అంటే నాకు చాలా ఇష్టం. తులసీదలం వంటి నవలలు చాలా పాపులర్. అయితే కొత్త కథ ఏదైనా ఉందే అని అడిగితే.. ఇప్పుడే ఒకటి రాస్తున్నా అని లైన్ చెప్పాడు. అదే అభిలాష. అయితే కథ నచ్చడంతో నాకు ఇవ్వండి సినిమాగా తీస్తాను అని అన్నాను. కథ మొత్తం అయ్యాక వినండి అని అన్నారు.

     అంతా కలిసి..

    అంతా కలిసి..

    ఆ కథను చిరంజీవి గారి మదర్ కూడా విన్నారు. అందులో హీరో పేరు కూడా చిరంజీవే. ఇక ఈ సినిమా కోసం సత్యానంద్, సత్యమూర్తి, యండమూరి, కోదండ రామిరెడ్డి అందరూ కలిసి చాలా శ్రమించారు. కొత్త తరహా సినిమాను, కొత్త చిరంజీవిని అందరూ చూశారు. ఈ సినిమా బడ్జెట్ తెలిస్తే అందరూ నన్ను కొడతారు. బడ్జెట్ ఎంతో చెబితే ఎవ్వరూ కూడా నమ్మరు.

    Recommended Video

    Rama Sathya Narayana Speech On One Night 999 Trailer
    లాభాలతో ఇళ్లు..

    లాభాలతో ఇళ్లు..

    అభిలాషను మొత్తం పదహారున్నర లక్షల్లో తీశాను.. ఇక పబ్లిసిటీకి అయిన ఖర్చు అంతా కలిపితే 18 లక్షలు అయి ఉండొచ్చు. అయితే ఈ సినిమాతో వచ్చిన లాభాలతో ఇళ్లు కట్టాను. చాలా పెద్ద హిట్ అయింది' అంటూ నాటి విషయాలను తెలిపారు.

    English summary
    K S rama Rao About Chiranjeevi Abhilasha Movie. Abhilasha is a 1983 Indian Telugu-language suspense thriller film directed by A. Kodandarami Reddy and produced by K. S. rama Rao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X