twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎందరో స్టార్‌లకు ఇళ్లను గిఫ్ట్‌గా ఇచ్చారు.. చివరకు ఆ నిర్మాత అలాంటి ఇంట్లో ఉంటున్నారా?

    |

    తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ప్రొడక్షన్ కంపెనీలు, బ్యానర్స్‌లో క్రియేటివ్ కమర్షియల్స్ అంటే అందరి మనసులో ఓ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రత్యేకతకు, భిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు కే ఎస్ రామారావు. సినిమా ఇండస్ట్రీలో ఒంటరిగా అడుగుపెట్టి చిరంజీవి వంటి స్టార్ హీరోతో సినిమాలు తీశారు. విభిన్న చిత్రాలను తీసి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. అయితే అలాంటి నిర్మాత పరిస్థితి ఇప్పుడు సరిగా లేదని తెలుస్తోంది.

    వరుసగా ఫ్లాపులు..

    వరుసగా ఫ్లాపులు..

    క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌లో చివరగా వచ్చిన రెండు చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని నమోదు చేయలేకపోయాయి. ఈ రెండు చిత్రాలతో నిర్మాత బాగానే నష్టపోయాడని టాక్ వినిపించింది. అయితే కేఎస్ రామారావు తాజాగా అలీతో సరదాగా అనే షోలో అతిథిగా విచ్చేశారు.

    సినిమాలు నిర్మించడం కష్టమే..

    సినిమాలు నిర్మించడం కష్టమే..

    ఇప్పుడున్న పరిస్థితులపై నిర్మాత స్పందిస్తూ.. ‘ఒకప్పటిలా పరిస్థితులు లేవు. అన్నీ మారిపోయాయి. డబ్బులు ఎక్కువ పెడితేనే చిత్రాలను నిర్మించగలం. పైగా ఈ జనరేషన్‌ వాళ్లతో అప్పటి తరానికి మా ఆలోచనలు అంతగా కలవడం లేదు. అందుకే కోసం వెనుకబడ్డాను. అది నిజమే. కానీ ఎప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటాను' అని పేర్కొన్నారు.

    ఆ అలవాటు..

    ఆ అలవాటు..

    హీరోలకు ఇంటిని గిఫ్ట్‌గా ఇస్తుంటారు ఆ కథ ఏంటని అలీ ప్రశ్నించారు. అందులో భాగంగా కేఎస్ రామారావు మాట్లాడుతూ.. ‘నాకు ఇంటిని డిజైనింగ్ చేయడంలో నైపుణ్యం ఉంది. నాకు నచ్చినట్టుగానే ఇంటిని కట్టిస్తుంటాను. అయితే హీరో హీరోయిన్లు వచ్చినప్పుడు ఎవరైనా అడిగితే వారికి ఇచ్చేవాడిని. అయితే అవి వారి డబ్బులే. అందులే ఏమీ లేదు. అలా నేను చిరంజీవి, మీనా, ఎన్టీఆర్ వంటివారికి ఇచ్చాను. అవన్నీ వాళ్ల డబ్బులే' అంటూ క్లారిటీ ఇచ్చారు.

    మీ స్థాయికి తగ్గ ఇళ్లు కాదు..

    మీ స్థాయికి తగ్గ ఇళ్లు కాదు..

    నిర్మాత నాటి విషయాలను చెబుతూ ఉంటే అలీ మధ్యలో కలగ జేసుకుంటూ ‘నాకెందుకు ఇళ్లు ఇవ్వలేదు' అని అడిగేశాడు. ఇప్పుడు ఎక్కడుంటున్నారు అని అడగ్గా.. నిర్మాత అడ్రస్ చెప్పారు. ‘ఆ ఇంటికి నేను వస్తాను.. చూసి బాగుందని అంటాను నాకిచ్చేయండి' అని అలీ అడిగడంతో..‘అది మీ స్థాయికి తగ్గ ఇళ్లు కాదండి.. నాకు మాత్రమే సరిపోతుంది.. అది మా ఫ్యామిలీకి మాత్రమే సరిపోయేది. మీ స్థాయి చాలా పెద్దది' అంటూ అలీకి సమాధానం ఇస్తారు. దీన్ని బట్టి చూస్తే నిర్మాతకు ఇప్పుడు అంత లగ్జరీ భవనం లేదని తెలుస్తోంది.

    English summary
    K S rama rao Gives Home Gift To Star Celebrities
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X