చిరంజీవితో తిరుగులేని చిత్రాలు.. తేజుకి బ్రేక్ ఇస్తాడా!
Recommended Video

సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం తేజ్ ఐ లవ్ యూ చిత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాయిధరమ్ తేజ తొలిసారి నటిస్తున్న రొమాంటిక్ చిత్రం ఇది. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో కథానాయిక. కరుణాకరన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పై మంచి బజ్ నెలకొని ఉంది. ఈ చిత్రానికి మరింత ప్రచారం కల్పించేలా మెగాస్టార్ చిరంజీవి ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. ఈ చిత్ర నిర్మాత కె ఎస్ రామారావుకు, మెగాస్టార్ చిరంజీవికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. నిర్మాతగా కె ఎస్ రామారావు ఐదు తిరుగులేని చిత్రాలని మెగాస్టార్ కు అందించారు.

రొమాంటిక్ లవ్ స్టోరీ
తేజు ఐ లవ్ యూ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతోంది. ప్రేమ కథల స్పెషలిష్టు కరుణాకరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఆడియో వేడుకకు మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్ర ఆడియో వేడుకకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. శనివారం రోజు ఈ చిత్ర ఆడియో వేడుక హైదరాబాద్ లో జరగబోతోంది. ఈ చిత్ర నిర్మాత కె ఎస్ రామారావు, చిరంజీవికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.

ఐదు సూపర్ హిట్స్
కె ఎస్ రామారావు నిర్మాణంలో చిరంజీవి 5 సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అభిలాష, ఛాలెంజ్ చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్, మరణ మృదంగం, రాక్షసుడు వంటి చిత్రాలు కూడా మెగాస్టార్ కెరీర్ లో విజయాలు గా నిలిచాయి.

హిట్ కోసం
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ అప్పుడే ఊపందుకుంటున్న తరుణంలో రామారావు ఈ చిత్రాలని నిర్మించారు. చిరు పెద్ద స్టార్ గా ఎదిగేందుకు ఈ చిత్రాలు బాగా ఉపయోగపడ్డాయి. మెగా మేనల్లుడు తేజు కూడా చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. తేజ్ ఐ లవ్ యు చిత్రం విజయం సాధిస్తుందనే ధీమాలో సాయిధరమ్ తేజ్ ఉన్నాడు.


Click it and Unblock the Notifications











