Don't Miss!
- Sports CSK vs LSG: కొంపముంచిన ముస్తాఫిజుర్.. లక్నోను గెలిపించిన స్టోయినిస్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సాహోపై నెగెటివ్ టాక్.. సినిమా చూసిన కేటీఆర్.. సెన్సేషనల్ కామెంట్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'సాహో'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత వచ్చిన సినిమా కావడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అనంతమైన క్రేజ్ నడుమ ఆగస్టు 30 వ తేదీన నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇంతకీ కేటీఆర్ ఏమన్నారు? ఆయన స్పందనేంటి? వివరాల్లోకి పోతే..
కేటీఆర్ తీరు.. వీకెండ్ వస్తే చాలు
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ అటు రాజకీయాల్లో రాణిస్తూనే ఎంటర్టైన్మెంట్ అస్సలు మిస్ చేసుకోరు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి వచ్చిన సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. సమయం దొరికితే చాలు ప్రతీ వీకెండ్లో సినిమాలు చూస్తుంటారు. ఇప్పటికే పలు తెలుగు సినిమాలపై తన అభిప్రాయం వెలిబుచ్చిన ఆయన తాజాగా సాహోపై తనదైన స్టైల్ కామెంట్ విసిరారు.
ట్విట్టర్లో యాక్టివ్.. ప్రభాస్ అభిమానులు ఖుషీ
దేశ విదేశాల్లో విద్యాబ్యాసం చేసి యంగ్ పొలిటిషన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కేటీఆర్. ముఖ్యంగా సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో కేటీఆర్‌ని మించిన మరో పొలిటీషియన్ లేడనే చెప్పుకోవాలి. ట్విట్టర్ లో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆయన తాజాగా సాహో సినిమాపై రియాక్ట్ అయిన తీరు ప్రభాస్ అభిమానులను ఖుషీ చేస్తోంది.
|
సాహో చూశా.. ఇదీ కేటీఆర్ రియాక్షన్
టాలీవుడ్ నుంచి వచ్చిన రెండు అద్భుతమైన సినిమాలు చూశాను. అందులో ఒకటి సాహో. ఈ సినిమా టెక్నికల్‌గా బ్రిలియంట్ గా ఉంది. భారతీయ సినిమా స్థాయిని పెంచేసేలా ఈ సినిమా షూట్ చేశారు. సాహోలో నటించిన హీరో ప్రభాస్, దర్శకుడు సుజీత్‌లకు నా అభినందనలు అని ట్వీట్లో పేర్కొన్నారు కేటీఆర్. మరో సినిమా ఎవరు కూడా చూశాను. స్క్రీన్ ప్లే చాలా బాగుంది అని తెలిపారు కేటీఆర్.
నెగెటివ్ టాక్.. సాహో ప్రభంజనం
భారీ సాంకేతికతను అందిపుచ్చుకొని తీసిన ఈ సినిమాపై మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. ప్రీమియర్ షోల సమయంలో మంచి టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత టాక్ మారింది. అయినప్పటికీ సాహో రికార్డుల సునామీ, కలెక్షన్స్ హంగామాపై ఏ మాత్రం ఎఫెక్ట్ కాలేదు. ఇప్పటికే 200 కోట్ల క్లబ్ లో చేరిన సాహో.. తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ అరుదైన రికార్డులు సొంతం చేసుకుంటోంది.
సాహో మూవీ
తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో ‘సాహో' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ‘రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించింది. పలు భాషల్లోని భారీ తారాగణం పాలుపంచుకుంది.